కందనవోలు సిగలో మరో కలికితురాయి చేరనుంది. నగరంలో ప్రతిష్ఠాత్మక స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు కానుంది. దీని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం శంకుస్థాపన చేసారు. కర్నూలు సర్వజన వైద్యశాల వద్ద క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రభుత్వం నిర్మించనుంది. ఇందులో సర్జికల్‌, మెడికల్‌, రేడియేషన్‌, అంకాలజీ తదితర విభాగాలన్నీ అందుబాటులో ఉంటాయి. పీజీ, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులతో సహా పరిశోధనలకు అవకాశం కల్పించేలా ఆస్పత్రిని తీర్చిదిద్దనున్నారు. మొదటి దశలో 120 పడకలతో: రాష్ట్రం విడిపోయిన తర్వాత కర్నూలులో క్యాన్సర్‌ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

kurnool 0902019

టాటా ట్రస్ట్‌ సంస్థ మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించగా ప్రభుత్వం ఆమోదించింది. జీ ప్లస్‌1 తరహాలో భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. దీనికిగాను సర్వజన వైద్యశాలలో పది ఎకరాలు కేటాయించారు. ఇందులో 1.5 ఎకరాల్లో భవన నిర్మాణాలు ఉంటాయి. కింది భాగంలో బయటి రోగుల(ఓపీ) విభాగంతోపాటు వైద్య పరీక్షల నిమిత్తం ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే, సీటీ స్కానింగ్‌తో సహా ప్రయోగశాలలు ఉంటాయి. మొదటి దశలో 120 పడకలతో ఏడాదిలోగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు రూ.120 కోట్లు మంజూరయ్యాయి. జన్మభూమి కార్యక్రమానికి హాజరవుతున్న సీఎం ఓర్వకల్లు నుంచే దీనికి పునాదిరాయి వేస్తారు.

kurnool 0902019

అందరూ మాట్లాడతారు... కొంత మందే పనిచేస్తారు. తమది పనిచేసే ప్రభుత్వమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఓర్వకల్లులో విమానాశ్రయం, సౌర పార్కులను ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ‘జలధార’, ‘మా ఊరి బాట’ పథకాలకు పైలాన్‌ ఆవిష్కరించారు. సీఎం మాట్లాడుతూ చివరి ఊపిరి ఉన్నంత వరకూ పేదల కోసమే పనిచేస్తానన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అనేక సమస్యలొచ్చినా పేదలెవ్వరూ కష్టపడకుండా ఉండాలని ముందుకెళుతున్నానన్నారు. కర్నూలుకు చరిత్రలో ఎప్పుడూ రానన్ని పరిశ్రమలు వస్తున్నాయన్నారు. విమానాశ్రయంతో నూతన చరిత్రకు శ్రీకారం చుట్టామన్నారు.

Advertisements