నిన్న ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ప్రెస్ మీట్ ప్రకంపనలు సృస్తిస్తుంది. కేంద్రంలో అతి పెద్ద కుంబకోణం బయట పెడుతున్నాం అని నిన్న కుటుంబరావు చెప్పటంతో, ఈ రోజు జీవీఎల్ నరసింహారావు , ఉదయం 10 గంటలకల్లా ఆదరా బాదరాగా ప్రెస్ మీట్ పెట్టి సంబంధం లేని విషయాలు చెప్పారు. జీవీఎల్ వ్యాఖ్యల పై కుటుంబరావు మళ్ళీ ఈ రోజు మధ్యాన్నం ప్రెస్ మీట్ పెట్టి, కడిగి పారేసారు. అంతే కాదు, నిన్న కేంద్రంలో ప్రకంపనలు సృష్టించే కుంబకోణం అని ఏదైతే చెప్పారో, దానికి కొంచెం హింట్ ఇస్తున్నా అంటూ, బీజేపీకి మరింత ఇబ్బంది పెట్టే అంశం బయట పెట్టారు.. సుప్రీం కోర్ట్ లో, అరుణ్ మిశ్రా బెంచ్ ముందు, స్వయంగా ప్రధాని మోడీ పై, ప్రశాంత్ భూషణ్ వేసిన కేసు విషయంలో, దిమ్మ తిరిగే వాస్తావాలు, ఫ్రెష్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ సంపాదించామని, ఈ విషయంలో త్వరలో దేశ రాజకీయల్లో ఒక కుదుపు రాబోతుంది అని, చెప్పారు.

kutumbrao 06062018 2

బహిరంగ చర్చకు రమ్మని తాను సవాల్‌ చేస్తే బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు అబద్ధాలు చెబుతున్నారని కుటుంబరావు అన్నారు. నిజం చెప్పమంటే జీవీఎల్‌కు అసహనం ఎందుకన్నారు. తీవ్ర అసహనంతో ఉన్న జీవీఎల్‌.. రోబోగా మారి అబద్ధాల వర్షం కురిపిస్తున్నారని విమర్శించారు. జీవీఎల్‌కు సబ్జెక్టు లేదని, అందుకే అడిగిన ప్రశ్నల్లో ఒక్కదానికీ సమాధానం చెప్పడం లేదని కుటుంబరావు ఎద్దేవా చేశారు. 'జరిగిన పనులపై నిజనిర్థారణ వేస్తామని జీవీఎల్‌ అంటున్నారు. ఇది పవన్‌కల్యాణ్‌ నుంచి నేర్చుకున్నారా?' అని ప్రశ్నించారు. ఆర్థిక రంగంపై అవగాహన ఉన్నందునే తనను ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారని కుటుంబరావు అన్నారు.

kutumbrao 06062018 3

2019 ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని.. కానీ 150 సీట్లకు మించి రావని అన్నారు. అగ్రిగోల్డ్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని, ఆత్మహత్యలు చేసుకున్న అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం మానవతా దృక్పథంతో బాధిత కుటుంబానికి రూ. 5 లక్షలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అగ్రిగోల్డ్ అంశాన్ని జగన్ రాద్దాంతం చేస్తున్నారని, వైసీపీ అధికారంలోకి వస్తే రూ. 11 వందల కోట్లు ఇస్తామని అంటున్నారని, ఆయన మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. జీవీఎల్‌ రాష్ట్ర ప్రభుత్వంపై ఇకనైనా తన లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని కోరారు. ఏ విషయంపైనా స్పష్టత లేకుండా గూగుల్‌లో సెర్చ్ చేసుకుని వచ్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Advertisements