2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చి నేనే గెలిపించా అని, ఇప్పుడు మోసాపోయానని, కొన్ని పార్టీలకు అలాగే జరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి నారా లోకేశ్ తప్పు బట్టారు. టీడీపీ పొత్తు పెట్టుకున్నవాళ్లు ఎలా మోసపోయారో పవన్‌ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పవన్‌ ఎప్పుడు అడిగితే అప్పుడు సీఎం అపాయింట్‌‌మెంట్‌ ఇచ్చామని చెప్పారు. అవిశ్వాస తీర్మానం పెడితే ఢిల్లీని వణికిస్తానని చెప్పి పవన్‌ ఫాంహౌస్‌లో పడుకున్నాడని ఎద్దేవా చేశారు. హోదా గురించి పవన్‌ ఎందుకు ఇప్పడు మాట్లాడటం లేదని లోకేశ్ ప్రశ్నించారు.

lokesh 21112018 2

రాఫెల్‌ కుంభకోణం, పెట్రోల్‌ ధరల గురించి ఎందుకు మాట్లాడటం లేదని విమర్శించారు. జగన్‌కు కేసులు ఉన్నాయి కాబట్టి జగన్‌ భయపడుతున్నారన్నారు, మరి పవన్ ఎందుకు భయపడుతున్నారో అని అన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి కూడా పవన్‌ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కోడికత్తి కేసు గురించి మాట్లాడటానికి లేఖలు రాయడానికి టైం ఉందిగాని హోదా గురించి మాట్లాడేందుకు పవన్‌కు సమయం ఉండటం లేదని, కోడి కత్తి చేయించింది సీఎం అనే చెబితే ఆయన ఎలా ఫోన్‌ చేసి మాట్లాడతారని లోకేశ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ ఆస్తులపై స్పందించారు.

lokesh 21112018 3

హాయ్‌ల్యాండ్‌ విషయంలో టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఆధారాలు లేకుండా తమపై విచారణ ఎలా వేసుకుంటామని ప్రశ్నించారు. ఆరోపణలు చేసిన వాళ్లను నిరూపించమంటే పారిపోతున్నారని దుయ్యబట్టారు. అసలు కోర్టులో ఉన్న ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయడం సాధ్యమేనా అన్న ఆయన.. ప్రతిపక్ష నేతలు పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ మంత్రి లోకేష్ తెరాస అధినేత కెసిఆర్ ను చూసి వ్యవసాయం చేయడం నేర్చుకోవాలని ఉందన్నారు. ఇది పొగడ్త కాదు వ్యంగ్యం అనమాట. వ్యవసాయంలో ఎకరానికి కోటి రూపాయల ఆదాయం ఎలా సంపాదించాలో తనకు తెలియడం లేదన్న లోకేష్.. కెసిఆర్ ఎలా చేసి ఎకరానికి కోటి సంపాదిస్తారో చూసి నేర్చుకోవాలని ఉందన్నారు. గతంలో తాను కూడా కొద్దిగా అగ్రివ్యాపారం చేసానని.. కానీ కోటి ఎలా సంపాదించాలో తెలియలేదని ఎద్దేవా చేశారు.

Advertisements