రాజధాని అమరావతి ప్రాంతలోని, మంగళగిరిలో ఇప్పటికే అనే ఐటి కంపెనీలు వచ్చిన సగంటి తెలిసిందే. మంగళగిరితో పాటు, గన్నవరం ఐటి టవర్ లో కూడా, అనేక ఐటీ కంపెనీల ఏర్పాటుతో యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. భారతదేశంలోనే టెక్నాలజీని ఉపయోగించే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రభాగంలో నిలుపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో పలు నూతన కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే మంగళగిరిలో పై డేటా సెంటర్స్ తో పాటు, అనేక చిన్న చిన్న ఐటి కంపెనీలు వచ్చాయి. గన్నవరంలోని మేధా టవర్స్ ఇప్పటికే నిండిపోయి ఉంది. ఈ నెల 13 నుంచి హెచ్ సీ ఎల్ కూడా 900 మందితో ప్రారంభం కానుంది.

mangalagiri 03092018 1

ఈ క్రమంలో అమరావతి రాజధాని ప్రాంతమైన విజయవాడ-గుంటూరు జాతీయ రహదారి వెంబడి మంగళగిరి వద్ద చినకాకాని గ్రామ పరిధిలో నూతనంగా నిర్మించనున్న మ్యాక్స్‌ ఐటీ టవర్స్‌ శంకుస్ధాపన కార్యక్రమానికి సోమవారం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌, సివిల్‌ సప్లైస్‌ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, ఐటీఈ అండ్‌సీ ప్రిన్సిపల్‌ సెక్రటరి కె.విజయానంద్‌, మంగళగిరి ఎమ్యెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, మున్సిపల్‌ చైర్మన్‌ గంజి చిరంజీవి హాజరై భూమిపూజ నిర్వహించనున్నారు.

mangalagiri 03092018 2

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటుగా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు భాగస్వాములై భావితరాల భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలని సంస్ధ నిర్వాహకులు బిట్రా వెంకటేష్‌, తుమ్మా సాంబశివరావు, జోగి వెంకటేశ్వరరావులు తెలిపారు. ఐటీ అభివృద్ధికి చంద్రబాబు కృషి అభినందనీయమన్నారు. 11 అంతస్థులతో నిర్మాణం చేసే మ్యాక్స్‌ ఐటీ టవర్స్‌ మొదటి ఫేజ్‌లో 15వేల మందికి, 2వ ఫేజ్‌లో మరో 15వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇంటిగ్రిటీ ఐటీకమ్యూనిటీస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌గా.. ట్రైనింగ్‌, రెసిడెన్సీ, ఉద్యోగం అన్ని ఒకే చోట ఉండే విధంగా నిర్మాణం చేస్తున్నామన్నారు. మంత్రుల రాకను దృష్టిలో ఉంచుకుని శంకుస్ధాపన ప్రాంగణాన్ని ముస్తాబు చేస్తున్నారు. సోమవారం శంకుస్థాపన కార్యక్రమ నిర్వాహణకు సర్వం సిద్ధం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

 

Advertisements