2013 ఫిబ్రవరి 24న ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధానమంత్రిగా తాను చేసిన వాగ్దానాన్ని ప్రస్తుత గౌరవ ప్రధాని గౌరవిస్తారని ఆశిస్తున్నానని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. రాజ్యసభలో స్వల్పకాల వ్యవధి చర్చలో పాల్గొంటూ... విభజన తర్వాత హైదరాబాద్‌ ఆదాయాలు తెలంగాణకే చెందుతాయి కనుక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న నిర్ణయాన్ని నాటి ప్రతిపక్ష నేత అరుణ్‌ జైట్లీ, ఇతర బీజేపీ నేతలతో కలసి చర్చించి తీసుకున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వం చేసిన వాగ్దానాలను ఎవరు అధికారంలో ఉన్నా గౌరవించాలని, ఆ వాగ్దానాలు పార్లమెంట్‌ తరఫున చేసినవని మన్మోహన్‌సింగ్‌... మోదీకి గుర్తు చేశారు.

manmohan 25072018 2

‘‘హైదరాబాద్‌లో వసూలయ్యే ఆదాయమంతా తెలంగాణకు వెళ్తుంది. దానివల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఇబ్బంది ఏర్పడుతుందన్న ఉద్దేశంతోనే ఆనాడు నేను ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చాను. నాటి ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌జైట్లీతోపాటు, ఇతర భాజపా సీనియర్‌ నేతలతో చర్చించిన తర్వాతే ఆ ప్రకటన చేశాను. ప్రభుత్వం అన్నది నిరంతర ప్రవాహం. సభలో ఇచ్చిన హామీలను గౌరవించి అమలు చేయాలి. పార్లమెంటులో ఇచ్చిన హామీలకు ఆ గుణం ఉంటుంది. ఇప్పుడు ప్రధాని సహచరులుగా ఉన్న వ్యక్తులతో చర్చించిన తర్వాతే నేను ఆనాడు హామీలు ఇచ్చినందున... ప్రధాని వాటన్నింటినీ అమలు చేయాలి.’’ అని మన్మోహన్ అన్నారు.

manmohan 25072018 3

చర్చకు కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమాధానమిచ్చారు. ‘‘విభజన చట్టంలోని ప్రతి అక్షరాన్నీ తు.చ. తప్పకుండా అమలు చేశాం. ఇప్పటికే 90 శాతం హామీలు నెరవేర్చాం. మిగిలినవి నెరవేరుస్తున్నాం. ప్రత్యేక హోదా ద్వారా లభించే నిధులకన్నా అధికంగానే ఇస్తున్నాం. ప్రధాన మంత్రి అంటే ప్రధాన మంత్రే. ఏ పార్టీ ప్రభుత్వానికి చెందిన వారైనా సరే... ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఏపీకి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తాం’’ అని రాజ్‌నాథ్‌ తెలిపారు. హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదని కూడా అన్నారు. అదే సమయంలో... మన్మోహన్‌ ఇచ్చిన హామీల్లో అత్యంత ప్రధానమైన ‘ప్రత్యేక హోదా’పై మాత్రం పాతపాటే పాడారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అడ్డంకిగా మారాయని రాజ్‌నాథ్‌ తెలిపారు. ‘‘

Advertisements