భారతీయ జనతా పార్టీ ప్రజలకు సంతోషాన్ని పంచాలని చూస్తుంటే.. కాంగ్రెస్‌ మాత్రం సమాజాన్ని విడదీయాలని చూస్తోందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా మోదీ నమో యాప్‌ ద్వారా రాయ్‌పూర్‌, మైసూర్‌, దమోహ్‌, కరోలి, ధోల్‌పూర్‌, ఆగ్రా ప్రాంతాల్లోని భాజపా కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఎన్నికల్లో గెలుపు సాధించడమనేది ముఖ్యమైన విషయం కాదు. దీని వల్ల మేము ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని పొందగలుగుతున్నాం. భాజపా ఐక్యత కోసం పోరాడుతుంటే.. కాంగ్రెస్‌ ఒక కుటుంబం లాభపడేందుకు ప్రజలను విడదీసేందుకు ప్రాధాన్యత ఇస్తుంది’ అని ఆయన విమర్శించారు.

modi 11102018 2

ప్రజలను ఏకం చేయడంలోనూ, వారికి ఆనందం పంచడంలోనూ భాజపా తరిస్తుంటే.. కేవలం ఒక కుటుంబ ప్రయోజనం కోసం కాంగ్రెస్‌ పార్టీ సమాజాన్ని విడగొడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. బుధవారం పలు లోక్‌సభ నియోజకవర్గాల భాజపా కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. గుజరాత్‌లో వలస కార్మికులపై దాడులు చెలరేగి, వారు సొంత రాష్ట్రాలకు తిరుగుముఖం పట్టడానికి భాజపాయే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలంటే... పార్టీ ప్రతిష్ఠకు సవాలు మాత్రమే కాదనీ, ప్రజలకు సేవచేసే అవకాశం కూడానని ఆయనపేర్కొన్నారు.

modi 11102018 3

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన పేరుతో ఒకే భాష మాట్లాడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్‌ విడదీసి ఒకరినొకరిని శత్రువులుగా చేసిందని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోను కాంగ్రెస్‌ అదే విధానాన్ని అవలంభించే అవకాశముందన్నారు. అయితే మోడీ వ్యాఖ్యల పై, ఏపి, తెలంగాణా ప్రజలు భగ్గు మంటున్నారు. ఇరు రాష్ట్రాల్లో ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చకుండా, సాక్షాత్తు పార్లమెంట్ లో, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మంచోడు అని, ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రికి మేచురిటీ లేదని, చెప్పటం, ఇరు రాష్ట్రాల మధ్య తగాదా పెట్టటం కాదా అని ప్రశ్నిస్తున్నారు.

Advertisements