కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథార్టీ సంస్థకు డైరెక్టర్‌గా తణుకు పట్టణానికి చెందిన టిడిపి నాయకురాలు ముళ్లపూడి రేణుకను సిఎం చంద్రబాబు ఎంపికచేశారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కీలకమైన పదవీ బాధ్యతలను తనకు అప్పగించినందుకు ఆమె మంగళవారం సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఎంతో నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. రియల్‌ ఎస్టేట్‌లో వినియోగదారుడు మోసపోకుండా చూడటానికి పూర్తి సమాచారాన్ని పారదర్శకంగా అందించడానికి రెరా సంస్థ కృషి చేస్తోందని తెలిపారు.

mullpudi 15082018 2

ఇకపై 8 ప్లాట్‌లకు పైబడి రియల్ ఎస్టేట్‌ వెంచర్ అప్రూవల్‌ పొందాలన్నా, 500 స్కేర్‌ మీటర్లు బిల్డింగ్‌ ప్లింతేరియా పైబడి భవనాన్ని నిర్మించి అమ్మాలన్నా రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరి అథార్టీ (రేరా) పరిధిలో నమోదు చేయించుకోవాలని ఆమె తెలిపారు. ఇకమీదట ఎల్‌పీ అనేది ఉండదని రేరా పరిధిలోనే రియల్‌ ఎస్టేట్‌ రంగం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. తనకు అప్పగించిన రేరా డైరెక్టర్‌ పదవికి ప్రిన్సిపాల్‌ సెక్రటరీ హోదా లభిస్తుందని ఆమె వెల్లడించారు. ఇకమీదట రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు సైతం రెరాలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. రియల్‌, అపార్టుమెంట్‌ సేల్స్‌ ఏజెంట్లు రాష్ట్రంలో సుమారు ఐదు వేల మందికిపైగా ఉంటారు.

mullpudi 15082018 3

అయితే ఇప్పటికి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారి సంఖ్య కేవలం రెండంకెలు దాటలేదంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. రెరాలో సమోదు నమోదు చేసుకోకుండా ఏ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రచారం నిర్వహించినా నేరమే. రెరాలో నమోదు కాని ప్రాజెక్టుల క్రయ, విక్రయాలు నిర్వహించడం, నూతన వెంచర్ల ప్రచారం నిర్వహించ కూడదని చట్టంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెరాలో నమోదు కాని ప్రాజెక్టుల ప్రచారాన్ని గమనించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలా ప్రచారం చేస్తున్న సంస్థలకు నోటీసులు అందించి రిజిస్ట్రేషన్‌లు జరగకుండా నివారిస్తారు.

Advertisements