అమరావతి క్రికెట్ ప్రేమికులకు ఈ నెలలో మంచి టైం పాస్... ఇండియా ఏ, సౌత్‌ ఆఫ్రికా ఏ, ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందుకోసం, దేశ, విదేశీ జట్లలో పేరుగాంచిన క్రికెటర్లు గన్నవరం ఎయిర్‌పోర్టుకు, అక్కడి నుంచి బస ఏర్పాటు చేసిన హోటళ్లకు మంగళవారం చేరుకున్నారు. మూలపాడులో ఈనెల17 నుంచి 29వ తేదీ వరకు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో క్రికెట్‌ సిరీస్‌ 2018ను నిర్వహించనున్నారు. ఈ సిరీస్‌లో పాల్గొనేందుకు ఇండి యా ఏ, బీ జట్లు సభ్యులతో పాటు సౌత్‌ ఆఫ్రికా ఏ, ఆస్ట్రేలియా ఏ జట్లు కూడా నగరానికి చేరుకున్నాయి.

mulapadu 15082018 2

ఆస్ట్రేలియా జట్టుతో పాటు గ్రెగ్‌ చాపెల్‌ కూడా విచ్చేశారు. నగరానికి చేరుకున్న క్రికెటర్లను ఆంధ్రా క్రికెట్‌ జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌. అరుణ్‌కుమార్‌, ట్రెజరర్‌ రామచంద్రరావు, వైస్‌ ప్రెసిడెంట్‌ త్రినాథరాజు, మీడియా మేనేజర్‌ సీఆర్‌ మోహన్‌ తదితరులు ఆహ్వానం పలికారు. అనంతరం అరుణ్‌ మాట్లాడుతూ మూలపాడులో జరగనున్న మ్యాచ్‌లు స్టార్‌ స్పోర్ట్‌ నుంచి ప్రసారమవుతాయని చెప్పారు. సుదీర్ఘ విరామం తర్వాత విజయవాడలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరగనుండడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

mulapadu 15082018 3

క్రిందటి ఏడాది సెప్టెంబర్ లో, ఇండియా A, జట్టు న్యూజిలాండ్ A జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్లు జరిగాయి.. అప్పుడు బాగా హోస్ట్ చేసినందుకు, బిసీసీఐ ఈ టెస్ట్ మ్యాచ్లు మూలపాడులో జరిగే అవకాశం ఇచ్చింది. రాష్ట్రాన్ని క్రీడాంధ్ర‌ప్ర‌దేశ్ గా త‌యారు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పదే పదే చెప్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, ఇంటర్నేషనల్ మ్యచ్లు ఆడే విధంగా, ప్రయత్నాలు చేస్తున్నారు. క్రికెట్ మాత్రమే కాకుండా, మిగతా క్రీడల్లో నైపుణ్యం ఉన్న వారిని వెతికి పట్టుకుని, వారిని మంచి క్రీడాకారులుగా తయారు చెయ్యటానికి, ప్రాజెక్ట్ గాండీవ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. దీనికి స్టార్ క్రికెటర్ అనిల్ కుంబ్లే సహకారం అందిస్తున్నారు.

Advertisements