ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో బీజేపీ ఏపీ కో ఇంచార్జ్ సునీల్ దియోధర్,  వైసిపి ప్రభుత్వం చేస్తున్న పనులను తీవ్రంగా తప్పు బట్టారు. నందిగామలోని టిడ్కో ఇళ్లను పరిశీలించిన ఆయన ,అక్కడ  జరుగుతున్నది చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు. ప్రజలకు టిడ్కో ఇళ్లు ఇస్తామని చెప్పి  రూ.లక్షల్లో వసూలు చేసి, ఇప్పుడు భాద్యత  లేకుండా ప్రవర్తిస్తున్నారని,  సునీల్ దియోధర్ విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను, ప్రజలు కట్టిన డబ్బులు కూడా  వృధా చేసారని,   నందిగామ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు పెడతానని ఆయన చెప్పారు.  అంతే కాకుండా అనుమతులు లేకుండా ఇలా కొండలు తవ్వటమేంటని, ఈ  అక్రమ తవ్వకాలను  వెంటనే నిలిపివేయాలి అని ఆయన డిమాండ్ చేసారు..

Advertisements