జగన్మోహన్ రెడ్డి  ఢిల్లీ పర్యటనపై తెలుగుదేశం పార్టీ  జనరల్ సెక్రటరీ నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేసారు.  ఈరోజు జగన్ ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే.  అయితే జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడం వెనుక స్టొరీ ఏంటో చెప్పాలని లోకేష్ ట్వీట్ చేసారు. ఎన్నోకేసుల్లో A1 గా ఉన్న రెడ్డి మళ్ళీ  ఢిల్లీకి ఎందుకు వెళ్లారు ? బాబాయ్‍ని హ-త్య చేసిన తమ్ముడిని రక్షించడానికా ? లేకపోతే  ఢిల్లీ లిక్కర్ స్కామ్‍లో ఏ2 అయిన విజయసాయిరెడ్డి  కుటుంబాన్ని కాపాడటానికా? అంటూ ఎద్దేవా చేసారు. ఇవేమీ కాకపోతే  కేంద్రం దగ్గర అప్పు తీసుకోవడానికి పర్మిషన్   కోసమా ? అంటూ జగన్ పై నారా లోకేశ్ ఒపీనియన్ పోల్ పెట్టారు. దీని పై నెటిజెన్ లు రకరకాలుగా తమ అభిప్రాయాలు చెప్తున్నారు. ఇక్కడ కొస మెరుపు ఏంటి అంటే, వైసీపీ మాత్రం, పోలవరం, స్పెషల్ స్టేటస్ కోసం ఢిల్లీ వెళ్ళారని చెప్పటం. నమ్మే వాళ్ళు ఉంటే, ఎన్నైనా చెప్తారు మరి.

Advertisements