పొంగూరు నారాయణ... మంత్రి నారాయణ అంటే త్వరగా అర్ధమవుతుంది... ఈయన పెద్దగా రాజకీయ విమర్శలు చెయ్యరు... ఎప్పుడూ పని పని అంటూ ఆయనకు అప్పగించిన పనిలోనే నిమగ్నమై ఉంటారు... అమరావతి బాధ్యతలు అన్నీ ఈ మంత్రి మీదే ఉన్నాయి... ఎప్పుడు పని అనే ఆలోచనలు చుట్టూ ఉండే నారాయణకు కూడా చిర్రెత్తించాడు... సైలెంట్ గా ఉండే నాయరణ కూడా ఇంత కౌంటర్ వేసేసరికి విలేకరులు అవాక్కయ్యారు... ఇంతకీ ఎవరా హీరో అంటారా...

narayana 29102017 2

ఇంకెవరు అండి... మన ప్రతిపక్ష నాయకుడు జగన్... జగన్ చేస్తున్న పనులు, ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల, ఎన్నాళ్ళ నుంచి దాచుకున్నారో ఏమో, ఇవాళ ఒక్క కామెంట్ తో, మొత్తం కక్కేశారు... ఆదివారం ఇయన నెల్లూరులోని చిల్డ్రన్స్‌పార్క్‌ను సందర్శించారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ... నవంబర్ 6వతేదీ నుంచి జగన్ ప్రారంభించే పాదయాత్రపై ఆయన పలు విమర్శలు చేశారు...

narayana 29102017 3

పెద్దగా స్పందిచాకపోయినా, ఒక్క కామెంట్ తో, ఆయనలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ బయటపెట్టారు..."వైఎస్ జగన్‌ది పాదయాత్ర కాదని... వైసీపీ అంతిమయాత్ర అని" సింపుల్ గా తేల్చేశారు... దీంతో అక్కడ ఉన్న విలేకరులు గెట్టిగా నవ్వేశారు...ఇంకా చెప్పండి సార్ అంటే, అంతకు మించి ఆయన గురించి ఏమి చెప్తాం, అంటూ, నెల్లూరులో జరుగుతున్న పనులు చెప్తా అంటూ చిల్డ్రన్‌ యాంఫీ థియేటర్‌, చిల్డ్రన్స్‌ లైబ్రరీ ఏర్పాటు, బేబీ స్విమ్మింగ్‌పూల్‌ అభివృద్ధి, అండర్‌ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్‌ లైన్‌ పనుల గురించి చెప్పారు... మొత్తానికి, సైలెంట్ గా ఉండే నాయరణ కూడా కౌంటర్ వేశారు అంటే, జగన్ మామూలోడు కాదంటూ అక్కడ ఉన్నవారు నవ్వుతూ మాట్లాడుకున్నారు...

Advertisements