దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ పై వస్తున్న వ్యతిరేకత ద్రుష్టిలో పెట్టుకుని, ఆరెస్సెస్‌ పావులు కదుపుతుంది... మోడీ ఓడిపోయినా, కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రాకూడదు అనే ఉద్దేశంతో భారీ స్కెచ్ వేస్తున్నారని ఎన్డీటీవీ సంచలన కధనం ప్రచురించింది. ఆ కధనం ప్రకారం, మోడీకి ప్రత్యామ్నాయ అభ్యర్దిగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని రంగంలోకి దించుతుంది ఆరెస్సెస్‌. 2019 ఎన్నికలకు కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రధానిగా రంగంలోకి దిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, దీనిలో భాగంగానే, వచ్చే నెలలో ఆరెస్సెస్‌ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆ సంస్థ అధినేత మోహన్‌ భగవత్‌ పంపిన ఆహ్వానాన్ని ప్రణబ్‌ అంగీకరించరనే సమాచారం రావటంతో, రాజకీయ వర్గాల్లో పెను ఆసక్తినే రేకెత్తించింది.

modi 30052018 2

ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరించిన ప్రణబ్‌ ముఖర్జీ ట్విటర్‌లో తననుతాను సిటిజన్‌ ముఖర్జీగా ప్రస్తావించుకుంటారు. తద్వారా తాను ‘స్వతంత్ర’ పౌరుడిననే సందేశాన్ని ఇస్తారు. ఈ సంకేతాలకు అనుగుణంగానే ఆయన తాజా చర్యలు ఉంటున్నట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గత జనవరిలో బిజూపట్నాయక్‌ జీవితచరిత్ర ఆవిష్కరణ సందర్భంగా.. భువనేశ్వర్‌లో ఒడిసా ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్‌ నవీన్‌ పట్నాయక్‌తో ప్రణబ్‌ ఒక విందు సమావేశం జరిపారు. సోనియాగాంధీ, శరద్‌ పవార్‌ ఇచ్చిన విందులాగా మీడియాలో దీనిపై ఎక్కడా హడావుడి జరగలేదు. అయితే, ఈ సమావేశానికి దేవెగౌడ, సీతారాం ఏచూరి, ఎల్‌కే ఆడ్వాణీ తదితరులు హాజరయ్యారు. పేరుకిది బిజూపట్నాయక్‌ జీవితచరిత్ర ఆవిష్కరణ సమావేశమే అయినా నిజానికి మూడో ఫ్రంట్‌ ఏర్పాటుకు సంబంధించిన కీలక సందర్భం కూడా అని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి.

modi 30052018 3

దానికి కొద్దినెలల ముందు ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉండగానే.. నవీన్‌ పట్నాయక్‌కు రాష్ట్రపతి భవన్‌లో విందు ఇచ్చారు. అక్కడి నుంచే వారు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీతో ఫోన్‌లో సంభాషణలు జరిపారు. బెంగాల్‌ వాస్తవ్యులైన దాదాకు, దీదీకి మధ్య ఆది నుంచీ సత్సంబంధాలున్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ లేదా ఎన్డీయేకు మెజారిటీ రానిపక్షంలో కీలకపాత్ర పోషించడానికి ప్రణబ్‌ సిద్ధంగా ఉన్నారని ఓ ఎంపీ వివరించారు. బీజేపీ లేదా ఎన్డీయేకు మెజారిటీ రాని పక్షంలో కాంగ్రె్‌సను ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వకూడదని ఆరెస్సెస్‌ పట్టుదలగా ఉంది. మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పాతుకుపోతుందన్నది దాని భయం. అందుకే.. అది ప్రత్యామ్నాయ వ్యూహాల మీద సీరియ్‌సగా దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటయ్యే ఫ్రంట్‌ వెనుక రహస్య అస్త్రమే ప్రణబ్‌ అని ఎన్డీటీవీ వర్గాలు విశ్లేషించాయి.

Advertisements