వైకాపాకు నెల్లూరు జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరు జడ్పీ ఛైర్మన్‌, వైకాపా నేత బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. వెంకటగిరి నియోజకవర్గం బాధ్యతలను మరొకరికి అప్పగించడంతో బొమ్మిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగన్‌ వైఖరి వల్లే మనస్తాపం చెంది పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు. తనకు జరిగిన అవమానం ఇంకెవరికీ జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బొమ్మిరెడ్డి వెల్లడించారు. ఎన్నికల్లో పోటీకి రూ.50 కోట్లు కావాలి.. అంత డబ్బు నువ్వు పెట్టగలవా? అని జగన్‌ తనను అడిగినట్లు బొమ్మిరెడ్డి తెలిపారు.

jagn 22092018 2

రాజకీయ అనుభవం కంటే డబ్బున్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఆనం పార్టీలో చేరగానే తనను బాధ్యతల నుంచి తప్పించారన్నారు. పార్టీలో తనకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. ‘ఆనం రూ.50 కోట్లు ఖర్చు పెట్టగలరు...నువ్వు అంత ఖర్చు పెట్టగలవా’ అని జగన్ అడిగారని తెలిపారు. జగన్ నాయకత్వంలో పనిచేసేకంటే ఇంట్లో ఉండటం మేలని వ్యాఖ్యానించారు. ఆత్మాభిమానం చంపుకొని పనిచేయాల్సిన అవసరం లేదని రాఘవేందర్‌ రెడ్డి స్పష్టం చేశారు.

jagn 22092018 3

మరో పక్క అదే నెల్లూరు జిల్లాలో, నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎమ్మెల్యే అనిల్‌ పై ఫైర్ అయ్యారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అనిల్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నారని, అప్పుడు నగరంలో కనీసం రెండు బోర్లయినా వేయించగలిగారా!? అని ప్రశ్నించారు. పేదలు నివసించడానికి పనికిరాని ఇళ్లను నిర్మించడంలో భాగస్వామిగా ఉన్న వ్యక్తి నేడు అత్యాధునికంగా పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్లపై విమర్శలు చేయడం దిగజారుడు తనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. యూజీడీ, తాగునీటి పథకాల పనులు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయన్న విషయాన్ని ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. నగరంలోని పేదల కోసం నిర్మించిన ఇళ్లు వారికి దక్కకుండా దుర్మార్గంగా వైసీపీ నాయకులు కోర్టుకు వెళ్లారని విమర్శించారు.

Advertisements