ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పర్యటన ఖరారైంది. లండన్‌లో అక్టోబర్‌ 24, 25 తేదీల్లో నార్మన్ ఫోస్టర్‌ ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం కానున్నారు. అమరావతి నిర్మాణాలపై ఫోస్టర్ అండ్ పార్టనర్స్ 25న తుది డిజైన్లు ఇవ్వనున్నారు.

అంత కంటే ముందే రాజమౌళి లండన్ వెళ్లనున్నారు. అక్టోబరు 11, 12, 13 తేదీల్లో లండన్‌ నార్మన్ ఫోస్టర్‌ ఆఫీస్‌లో అమరావతి పరిపాలన నగరం ఆకృతులపై వర్క్‌షాప్‌‌లో డైరెక్టర్‌ రాజమౌళి పాల్గొననున్నారు. డిజైన్ లలో చెయ్యాల్సిన మార్పులు, తెలుగు సంస్కృతికి అద్దంపట్టేలా తీసుకోవాల్సిన చర్యులు, తగు సూచనలు ఇస్తారు..

వీటి ప్రకారం నార్మన్ ఫోస్టర్‌ ప్రతినిధులు తుది డిజైన్ లు రెడీ చేసి, అక్టోబర్‌ 24, 25 తేదీల్లో లండన్ లోని వారి ఆఫీస్ లో ముఖ్యమంత్రితో చర్చించి, డిజైన్ లు ఫైనల్ చేస్తారు...

Advertisements