విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు, సరికొత్త ఆపరేషన్ కు తెర లేపారు. అటు ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఇటు మానవత్వ కోణంలో కూడా ఈ ఆపరేషన్ జరగనుంది. విజయవాడ నగరంలో, బిచ్చగాళ్ళను, నిరాశ్రయులను ఆదుకునే కార్యక్రమం, ఆపరేషన్‌ బెగ్గర్‌ కు, విజయవాడ నగరపాలక సంస్థ రెడీ అయ్యింది. ఈ మేరకు, నగరపాలక సంస్థ కమిషనర్‌ జె. నివాస్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కమిషనర్‌ నివాస్‌ ఆదేశాల ప్రకారం, బిచ్చగాళ్ళను, నిరాశ్రయులను కనిపెట్టే ప్రయత్నంలో, నగరపాలక సంస్థ అధికారులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా, ప్రధాన కూడల్లలో ఉండే వారిని గుర్తించటం మొదలు పెట్టారు. ఇందులో భగంగా, ఇప్పటికే కొంత మందిని గుర్తించారు. వారితో మాట్లాడారు.

vmc 08072018 2

వారిని, పూర్ణానందంపేట నవజీవన్‌ బాలభవన్‌ కు తీసుకువచ్చారు. అక్కడ నుంచి, హైదరాబాద్‌ చౌటుప్పల్‌ దగ్గర ఉన్న అమ్మనాన్న అనాధ ఆశ్రమానికి శుక్రవారం తరలించారు. ఇలా తరలించిన వారిలో, బిచ్చగాళ్ళు, నిరాశ్రయులు, ముసలి వారు, వికలాంగులు, మతి స్థిమితం సరిగ్గా లేని వారు ఉన్నారు. ఇలాంటి వారిని ఒప్పించటం, వారు ఒప్పుకోకపొతే బలంతంగా తరలించటం చేస్తున్నారు. వీరిని అక్కడకు తీసుకువెళ్ళి సరైన కౌన్సిలింగ్ ఇవ్వటం, వారి ఆరోగ్యం మెరుగు పడేలా చెయ్యటం, ఒపికి ఉన్నవారికి పనులు నేర్పించటం వంటివి చేస్తారు. ఈ కార్యక్రమం పట్ల, విజయవాడ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

vmc 08072018 3

ఈ సందర్భంగా కమిషనర్‌ జె. నివాస్‌ మాట్లాడుతూ నగరంలోని రైల్వే స్టేషన్‌, పాత, కొత్త గవర్నమెంట్‌ హాస్పటల్‌, ఏలూరు రోడ్డు, బీఆర్టీఎస్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లోని నిరాశ్రయులను, బెగ్గర్లను 80మందిని సేకరించి ఒక దగ్గరకు తీసుకువచ్చామన్నారు. వారిలో వికలాంగులు, వ్యాధిగ్రస్తులు, మానసిక వికలాంగులు ఉన్నారన్నారు. నగరపాలక సంస్థ వీరిని మాములు మనుషులుగా తీర్చిదిద్దడానికి హైదారాబాద్‌ చౌటుప్పల్‌లో అమ్మనాన్న అనాధ ఆశ్రమంతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందన్నారు. వీరందరిని ఆశ్రమానికి తరలించి వారి ఆరోగ్య, భోజన తదితర వసతులు అందిస్తారన్నారు. రాబోయే రోజుల్లో నగరంలో ఉన్న నిరాశ్రయులు, బెగ్గర్లను గుర్తించి వారిని కూడా తరలించి తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం ప్రెసిడెంట్‌ గట్టు గిరి, వ్యవస్ధాపకులు గట్టు శంకర్‌, నగరపాలకసంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisements