జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు మరోసారి కంటి ఆపరేషన్ జరిగింది. గత కొన్ని నెలలుగా కంటి సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవల కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు. అయినా కంటి బాధ తగ్గకపోవడంతో మరోసారి ఆపరేషన్ చేయించారు. బంజారాహిల్స్‌లోని ‘సెంటర్ ఫర్ సైట్’ కంటి ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది. నేత్ర చికిత్స వైద్య నిపుణులు డాక్టర్ సంతోష్ జి.హోనావర్.. పవన్‌కల్యాణ్‌కు కంటి ఆపరేషన్ నిర్వహించారు. మరో డాక్టర్ జీవీఎస్. ప్రసాద్ ఆపరేషన్‌కు సంబంధించిన అవసరాలను పర్యవేక్షించారు.

pk 23082018 2

కిందటి నెల శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి కంటిలో కురుపును తొలగించారు. అనంతరం విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. కానీ, శస్త్ర చికిత్స తరవాత కూడా ప్రజా పోరాట యాత్రను కొనసాగించడంతో జనసేనానికి విశ్రాంతి లేకుండా పోయింది. తగినంత విశ్రాంతి లేకపోవడంతో కంటికి ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యుల సలహా మేరకు పవన్ గురువారం మరోసారి కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు. ఇప్పుడైనా తగినంత విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు పవన్‌కు సూచించారు.

pk 23082018 3

మరో పక్క నిన్న పవన్ రాజకీయ వ్యవహారాల కమిటీ(ప్యాక్‌)తో చర్చలు జరిపారు. మేనిఫెస్టోలోని అంశాలకు విస్తృత ప్రచారం కల్పించాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(ప్యాక్‌) బాధ్యులను ఆదేశించారు. 12 అంశాలతో కూడిన జనసేన విజన్‌ డాక్యుమెంట్‌ ఇప్పటికే ప్రజల మన్ననలను పొందుతోందన్నారు. దాన్ని అన్ని వర్గాలకు మరింతగా చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సెప్టెంబరు 12 నుంచి ప్రారంభించి ఎన్నికల వరకు ప్రచారాన్ని కొనసాగించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఒక్కరికి విజన్‌ డాక్యుమెంట్‌ను చేరువచేయాలని ఆదేశించారు. పవన్‌ ఆదేశాల మేరకు బుధవారం ఇక్కడ మాదాపూర్‌లోని పార్టీ కార్యాలయంలో ప్యాక్‌ సభ్యులు సమావేశమయ్యారు. విజన్‌ డాక్యుమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

Advertisements