నిన్న రమణ దీక్షితులు ప్రెస్ మీట్ తో, ఒక నిర్ఘాంతపోయే విషయం బయట పడింది... క్రైస్తవ మత ప్రచారంలో చురుగ్గా పాల్గొనే బోరుగడ్డ అనిల్‌తో కలిసి రమణ దీక్షితులు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టటంతో, యావత్ హిందూ మతం అవాక్కయింది... స్వామి వారికి సేవ చేసిన దీక్షితులు, ఇలాంటి అన్యమత ప్రచారం చేస్తున్న వ్యక్తులతో కలిసి, చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. గుంటూరుకు చెందిన అనిల్‌.. సైమన్స్‌ అమృత్‌ ఫౌండేషన్‌ అనే క్రైస్తవ చారిటీ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆయన... రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్పీఐ) రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కూడా... బుధవారం హైదరాబాద్‌లో రమణ దీక్షితులు వెనకే ఆయన కూర్చున్నారు.

deekshitulu 21062018

దీక్షితులు మాట్లాడుతుండగా మధ్యలో జోక్యం చేసుకున్నారు. తమ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే తనకు ఫోన్‌ చేసి టీటీడీ వివరాలు అడిగారని.. తాను నివేదిక తయారు చేసి పంపించానని చెప్పారు. బోరుగడ్డ అనిల్‌పై పలు కేసులు, ఆరోపణలున్నాయి. గత ఏడాది రాజధాని పరిధిలోని తాడికొండ స్టేషన్‌లో ఆయనపై మారణాయుధాలు కలిగి ఉండటంతోపాటు చీటింగ్‌ కేసు నమోదైంది. ఓ స్థలం విషయంలో 2016 ఏప్రిల్‌లో ప్రకాశం జిల్లాకు చెందిన ఇంటూరి సురేశ్‌ బాబును బెదిరించి డబ్బు డిమాండ్‌ చేశారని, తప్పుడు డాక్యుమెంట్లతో ఆస్తిని కాజేసేందుకు ప్రయత్నించారని కేసు నమోదైంది. అనిల్‌ను అరెస్టు చేశారు. ఈ సమయంలో ఆయన కారులో మారణాయుధాలు లభించాయి. దీంతో రెండు కార్లను కూడా తాడికొండ పోలీసులు సీజ్‌ చేశారు.

deekshitulu 21062018

అనిల్‌ గుంటూరులో తనకు తాను ప్రముఖుడిగా చెప్పుకుంటూ కేంద్ర మంత్రుల పేర్లు చెప్పుకొని పంచాయితీలు చేస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. తన కారుపై ఎంపీల స్టిక్కర్‌ వేసుకొని తిరుగుతూ.. కేంద్ర మంత్రులు, ప్రముఖులు తనకు బంధువులని చెప్పుకుంటారని తెలుస్తోంది. ‘మా పిన్నమ్మ జగన్‌కు బంధువు’ అని అనిల్‌ పేర్కొంటారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఓ క్రైస్తవ సంస్థ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పత్రికలకు ఫొటోలు పంపుతుంటారు. జగన్ బావమరిదిని అని చెప్పుకుంటూ, వైఎస్ వై. యెస్. వివేకానంద రెడ్డికి మేనల్లుడు వరుస అని కూడా చెప్పుకుంటూ తిరుగుతాడని, ఇప్పటి వరకు వైఎస్ ఫ్యామిలీ ఈ ప్రచారాన్ని ఖండించలేదని, వైఎస్ ఫ్యామిలీకి ఈయన బంధువు అని చెప్పటానికి ఇదే నిదర్శనం అని అంటున్నారు. (Courtesy: ABN Andhrajyothy)

Advertisements