ఒక పక్క ప్రధాని నరేంద్ర మోడీ రోజు రోజుకీ పెట్రోల్, డీజిల్ రెట్లు పెంచేస్తూ, ప్రజల నడ్డి విరుస్తుంటే, ఆర్ధిక కష్టాలు ఉండి, ఆదాయం వచ్చే పెట్రోల్, డీజీల్ రేట్లను చంద్రబాబు తగ్గించి, మధ్యతరగతి ప్రజలకు ఎంతో కొంత ఊరట ఇచ్చారు. ఈ రోజు వాహనదారులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజీల్‌పై పన్ను తగ్గించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. డీజిల్, పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులో లీటరుకు 2 రూపాయలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్ర ఖజానాపై భారం పడే అవకాశం ఉంది.

cbn 10092018 2

కాగా పెట్రోల్ పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ సోమవారం భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంధన ధరల పెరుగుదలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ... ఇవాళ కాంగ్రెస్ సారథ్యంలో ప్రతిపక్షాలకు చెందిన మొత్తం 21 పార్టీలు భారత్ బంద్ చేపట్టాయి. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నప్పటికీ... పెట్రోల్, డీజిల్ ధరలకు మాత్రం కళ్లెం పడలేదు. ఇవాళ భారత్ బంద్ జరుగుతుండగానే పెట్రోల్ ధర 23 పైసలు, డీజిల్ ధర 22 పైసల మేర పెరగింది. దీంతో ప్రస్తుతం దేశ రాజధానిలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.80.73, రూ. 72.83కి చేరాయి. మరోవైపు దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఈ ధరలు రూ.88.12, రూ.77.32గా ఉన్నాయి.

cbn 10092018 3

ప్రస్తుతం కేంద్రం లీటర్‌ పెట్రోల్‌పై రూ.19.48, డీజిల్‌పై రూ.15.33 మేర ఎక్సైజ్‌ సుంకాన్ని వడ్డిస్తోంది. అదనంగా రాష్ట్రాలు కూడా విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌)ను వసూలు చేస్తున్నాయి. అత్యధికంగా పెట్రోల్‌ పై మహారాష్ట్ర 39.12%.. డీజిల్‌పై తెలంగాణ 26% వ్యాట్‌ను వర్తింపజేస్తున్నాయి. ఎన్నడూలేని విధంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో సామాన్య వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకూ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.2.85 మేర, డీజిల్‌ ధర రూ.3.30 మేర పెరిగింది. అయితే చంద్రబాబు కొంత తగ్గించటంతో, ఎంతో కొంత ఊరట లభిస్తుంది.

Advertisements