ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాల సరళి, రాజకీయ పరిణామాలు, తదుపరి కార్యాచరణపై కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. తమ పరిశీలనకు వచ్చిన వివిధ అంశాలను నేతలు పవన్‌కు వివరించారు. వచ్చే నెల నుంచి మంగళగిరిలో పార్టీ సమావేశాలు నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి జనసేన అభ్యర్థులు వచ్చి పవన్‌ను కలిశారు. ఎన్నికల సరళి, కౌంటింగ్‌ జరిగిన విధానాన్ని పవన్‌కు వివరించారు.

pk 24052019 1

ప్రత్యామ్నాయ రాజకీయాలే లక్ష్యమంటూ బరిలో దిగిన జనసేనకు ఈ ఎన్నికల్లో తీవ్ర నిరాశే మిగిలింది. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రెండుచోట్ల పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఎన్నో అంచనాలతో బరిలో దిగిన ఆ పార్టీ కేవలం ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో జనసేన ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాజోలు నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ గెలుపొందారు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తో సహా మిగతా అభ్యర్థులందరూ పరాజయం పాలయ్యారు.

Advertisements