జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేపటి ఆంధ్రప్రదేశ్ పర్యటన రద్దయింది... రేపు శ్రీకాకుళం జిల్లాలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటించాల్సి ఉంది... గిరిపుత్రుల హెచ్చరికతో పవన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు... మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని గతంలో జనసేనాని డిమాండ్ చేశారు. వారికి మద్దతు తెల్పేందుకు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆదివాసీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మత్స్యకారులను ఎస్టీలో చేర్చితే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. పవన్ పర్యటనను అడ్డుకుంటామని గిరిజనులు హెచ్చరించడంతో పవన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

pk 20022018 2

ఇది అసలు కారణం... మత్స్యకారుల సమస్యను పార్టీలకు అతీతంగా పరిష్కరించాలని, వారిని ఎస్టీ జాబితాలో ఉండాలని పవన్ అన్నారు... మత్స్యకారుల సమస్యలు తనకు తెలుసునని, వారిని ఎస్టీల్లో చేర్చే ఉద్యమానికి అండగా ఉంటానని చెప్పారు... ప్రభుత్వం వారి దీక్షను అడ్డుకోవద్దని కూడా సూచించారు...మేనిఫెస్టోలో పెట్టినప్పుడు దానిని పరిగణలోకి తీసుకోవాలన్నారు. అయితే, పవన్ కళ్యాణ్‌ను మత్స్యకారులను కలవడం, వారు మద్దతు తెలిపిన నేపథ్యంలో ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

pk 20022018 3

మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండుకు పవన్ మద్దతివ్వడంపై వారు మండిపడ్డారు. వారిని ఎస్టీల్లో చేర్చితే తమకు అన్యాయం జరుగుతుందని వారు వాపోయారు.మత్స్యకారుల డిమాండుకు పవన్ మద్దతు పలకడంపై ఆదివాసీల నేత గుర్నాథం మండిపడ్డారు. పవన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం మత్స్యకారులకు ఎస్టీ జాబితా విషయంలో మద్దతు పలికాడని మండిపడ్డారు. కులాలు, జాతుల వ్యవహారాలు, స్థితుగతులు తెలియని పవన్ పనికిమాలిన ప్రకటనలు మానుకోవాలన్నారు. అయతే, ఆ తర్వాత ఆయన తన ప్రకటనపై వివరణ ఇచ్చారు.

Advertisements