కడప జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్‌ కేంద్రంలోని నరేంద్రమోదీ సేనకు ఇప్పుడు కీలక శత్రువుగా మారారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితులపై కేంద్రం గురిపెట్టిన తరుణంలో సీఎం రమేశ్‌ టార్గెట్‌గా ఆదాయపు పన్నుశాఖ అధికారులు కదిలారు. ఆయన ఇంటిపై, ఆస్తులపై రోజుల తరబడి సోదాలు జరిపారు. చివరికి వారికి ఏం దొరికిందో తెలియదు కానీ.. ఈ సోదాల వెనుక ఏ రాజకీయం దాగిఉందో ప్రజలు మాత్రం ఓ అభిప్రాయానికి వచ్చారు. పార్లమెంట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై రమేశ్‌ గొంతెత్తారు. కేంద్రప్రభుత్వ చేసిన నిర్వాకంపై చట్టసభలో ఎండగడుతున్నారు. అంతేకాదు.. బీజేపీతో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకున్నాక కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాల్లో కూడా సీఎం రమేశ్‌ది కీలకపాత్ర! పార్లమెంట్‌ సెషన్స్‌ జరిగిప్పుడే కాదు- మమూలు సమయాల్లో కూడా విభజన చట్టం అమలుపై ఆయన కేంద్రాన్ని నిలదీస్తున్నారు. ఈ పరిణామాలేవీ కమలనాథులకు రుచించలేదు. ఇదే సమయంలో ఈ మధ్యనే కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం గట్టిగా గళమెత్తారు.

ramesh 18102018 2

ఇంతటితో రమేశ్‌ ఊరుకోలేదు. ఇటీవల ఏపీలో జరుగుతున్న ఐటీ దాడులు కక్షపూరితమైనవనీ, దీనికి సమాధానం చెప్పాలనీ కోరుతూ సంబంధిత కేంద్రశాఖకు నోటీసులు పంపారు. ఇది జరిగిన మూడవ రోజునే సీఎం రమేశ్‌ ఇల్లు, ఆస్తులపై ఐటీ అధికారులు విరుచుకుపడ్డారు. తాజా దాడులకు నేపథ్యం ఇలా ఉండగా.. తనపై ఇంత త్వరగా ఐటీ సోదాలకు పురికొల్పిన అంశం మరొకటి ఉందని సీఎం రమేశ్‌ వాదిస్తున్నారు. ఎప్పటినుంచో సీఎం చంద్రబాబుపైనా, ఆయన సన్నిహిత నేతల పైనా కక్షతో రగిలిపోతున్న వైసీపీ అధినేత జగన్‌, ఆయన ప్రతినిధుల ప్రోద్బలంతోనే కేంద్రం ఈ దాడులు చేయించిందని రమేశ్‌ చెబుతున్నారు. ఆయన వాదనతో టీడీపీకి చెందిన ముఖ్య నేతలు కూడా ఏకీభవిస్తున్నారు.

ramesh 18102018 3

కేంద్ర బీజేపీ పెద్దలతో లోపాయికారీ బంధాన్ని కొనసాగిస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఈ మొత్తం వ్యవహరంలో కీలక భూమిక పోషించారని ఢిల్లీలో టాక్ నడుస్తుంది. కడపలో స్టీల్‌ప్లాంట్‌ గురించి దీక్ష చేయడంతో జగన్‌కీ, ఆయన పార్టీ నేతలకీ అస్తిత్వ సమస్య వచ్చింది. దీంతో సీఎం రమేశ్‌ పై వెంటనే దాడులు జరిగేలా వైఎస్‌ జగన్‌, విజయసాయిరెడ్డి ద్వారా కేంద్ర బీజేపీ పెద్దలపై వత్తిడి తెచ్చారని ఢిల్లీ వర్గాల్లో చక్కర్లు కొడ్తుంది. అందుకే ఈ దాడుల వెనుక విజయసాయిరెడ్డి పాత్ర ఉందని సీఎం రమేశ్‌ కూడా ఆరోపిస్తున్నారు. సియం రమేష్ పై, ఒక ప్రెస్ మీట్ లో, విజయసాయి రెడ్డి బూతులు తిట్టిన సందర్భం కూడా ఉంది. ఈ స్కెచ్ అంతా, బీజేపీతో సన్నిహితంగా ఉంటూ, వైఎస్‌ జగన్‌, విజయసాయిరెడ్డి ద్వారా నడిపించారని తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగా నమ్ముతుంది. అందుకే సియం రమేష్, ఈ ఐటి దాడుల వ్యవహారం పై కోర్ట్ కి కూడా వెళ్లి, అసలు ఎవరు వల్ల, ఎందుకు ఈ దాడులు చెయ్యాల్సి వచ్చిందో చెప్పాలని కోరనున్నారు.

Advertisements