పోలవరం విషయంలో చంద్రబాబు, నితిన్‌ గడ్కరీని కలిసినప్పుడు, కొత్త టెండర్లు పిలిస్తే ఆ అదనపు భారం రాష్ట్రం భరిస్తుంది అని చెప్పారు... ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ట్రాయ్‌ కోట్‌ చేసిన మైనస్‌ 14 శాతానికి మించితే.. ఆ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులకు కొత్త టెండర్లను పిలిచేందుకు తమకు అభ్యంతరం లేదంటూ నితిన్‌ గడ్కరీ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ రిటైర్‌మెంట్‌కు మూడు రోజుల ముందు ఆ టెండర్లను ఆపాలంటూ కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి అమర్జిత్‌ సింగ్‌ ఆదేశాలు జారీ చేసి, పోలవరం విషయంలో గందరగోళ పరిస్థితికి దారి తీశారు..

polavaram ias 02122017

నిజానికి ఈ అధికారి పై, రాష్ట్ర జల వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు ముందు నుంచి గుర్రుగా ఉన్నారు... జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి హోదాలో పనిచేసిన అమర్జిత్‌ సింగ్‌ పోలవరం ప్రాజెక్టుకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని, సీఎం చంద్రబాబుతోనూ ఓ సందర్భంలో దురుసుగా మాట్లాడారని ఆ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి... గత ఏడాది జూన్‌ చివరి వారంలో పోలవరం ప్రాజెక్టుకు నిధులు, డిజైన్ల అనుమతులకు సంబంధించి చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. జాతీయ హోదా ప్రాజెక్టుగా గుర్తించినందున పోలవరానికి సంపూర్ణ సహకారం అందించాలని అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని సీఎం చంద్రబాబు కోరుతున్న సమయంలో అమర్జిత్‌ సింగ్‌ జోక్యం చేసుకున్నారు.

polavaram ias 02122017



‘వాస్తవానికి ప్రాజెక్టు నిర్మాణ పనులు ఒకలా ఉంటే అధికారులు చెబుతున్న లెక్కలు మరోలా ఉన్నాయని.. వాటిని నమ్మేస్తే ఎలా? ప్రాజెక్టుల నిర్మాణం గురించి మీకు తెలుసా?’ అని సీఎంని అమర్జిత్‌ సింగ్‌ ప్రశ్నించారు. అమర్జిత్‌ అలా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు మాత్రం సంయమనం పాటిస్తూ.. ‘ప్రాజెక్టుల నిర్మాణంలో ఎవరి నుంచైనా పాఠాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. నాకు బేషజాలు లేవు. కొత్త విషయాలను నేర్చుకోడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను... జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించిన 18 సాగు నీటి పథకాల్లో ఎన్నింటిని కేంద్ర జల వనరుల శాఖ నిర్ణీత సమయంలో పూర్తి చేసిందో.. వాటిలో ఏ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేశారో చెబితే.. వాటిని చూసి పోలవరం ప్రాజెక్టునూ అదే తరహాలో వేగవంతంగా పూర్తి చేస్తాం’ అని సమాధానం ఇచ్చారు. అదే సమయంలో ఉమాభారతి జోక్యం చేసుకుని.. దేశంలోనే అత్యంత అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రితో మాట్లాడేతీరు అది కాదని అమర్జిత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో అమర్జిత్‌ సింగ్‌ పోలవరాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారని జలవనరుల శాఖ వర్గాలు తెలిపాయి.

Advertisements