చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఫలితాలు ఇస్తుంది... సోమవారం ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి పర్యటన ముగించుకున్న సిఎం చంద్రబాబు సాయంత్రం ఢిల్లీకి చేరుకుని, కేంద్ర జలవనరులు, రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘంగా భేటీ అయ్యారు...

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి, రూ. 2800 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్న నిధులు ఇవ్వటానికి కేంద్రం అంగీకరించింది...

నాబార్డుతో తాను మాట్లాడుతానని, పెండింగ్‌ నిధులు వారం రోజుల్లో వచ్చేలా చర్యలు తీసుకుంటానని గడ్కరీ హామీ ఇచ్చారు.... అక్టోబర్ ౩ న రాష్ట్రానికి వస్తున్నా గడ్కరీ పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శిస్తానని ముఖ్యమంత్రికి చెప్పారు...

Advertisements