ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ విధానం పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వెలగపూడి సచివాలయంలోని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ ని సందర్శించిన రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ ఆ విశేషాలు వివరిస్తూ తన అధికారిక ట్విట్టర్‌ ఎకౌంటు నుంచి మొత్తం 24 ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లను 19,153 మంది లైకు చేయగా.. 4,084 మంది రీట్వీట్‌ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా, సాక్షాత్తు రాష్ట్రపతే ట్వీట్ చెయ్యటంతో, ఎంతో సంతోషిస్తూ అభినందనలు తెలిపారు.

president 3012202017 2

అంతే కాదు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, కన్నడ సినీనటుడు ఉపేంద్ర, రాష్ట్రపతి ప్రెస్‌ కార్యదర్శి అశోక్‌ మాలిక్‌, కర్ణాటక పాత్రికేయుడు చక్రవర్తి సులిబెలె సహా పలువురు ప్రముఖులు రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రంలో కూర్చొని సమీక్షిస్తున్న చంద్రబాబు ఫోటోని ట్విట్టర్‌లో పోస్టు చేసి అభినందనలు తెలిపారు. చంద్రబాబు చిత్రానికి నటుడు ఉపేంద్ర పారదర్శకత అనే మాటలు పెట్టి పోస్టు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షించే డిజిటల్‌ సాధికార భారతదేశానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ పెద్ద బలం. నామమాత్రపు ధరకు అత్యంత వేగవంతమైన అంతర్జాల సదుపాయాన్ని అందించి రాష్ట్రం మొత్తాన్ని డిజిటల్‌ పరంగా అనుసంధానించే దూరదృష్టి గొప్పది. ముఖ్యమంత్రి చంద్రబాబు, అతని బృందాన్ని అభినందిస్తున్నా అంటూ మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ట్వీట్ చేసారు. 

president 3012202017 3

చక్రవర్తి సులిబెలె, అనే ప్రముఖ పాత్రికేయుడు ట్వీట్ చేస్తూ, ఐటీ నగరమైన బెంగళూరుకు 500 కిమీ దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ ద్వారా పాలిస్తున్నారు. కర్ణాటకలో మనం నిద్రపోతున్నాం అన్నారు... ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మూడేళ్లుగా సీఎం డ్యాష్‌బోర్డును నిర్వహిస్తోంది. సాంకేతికతను వినియోగించి పథకాల అమలును పర్యవేక్షిస్తోంది. మిగతా రాష్ట్రాలు కూడా ఈ బాటలో నడవాలి, అంటూ ది లాజికల్‌ ఇండియన్‌ అనే మీడియా కంపెనీ ట్వీట్ చేసింది... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి అభినందనలు. బెంగళూరు లాంటి సిలికాన్‌ నగరం ఇలాంటి నాయకుడిని కోరుకుంటోంది అంటూ బెంగళూరు వాసులు ట్వీట్ చేసారు.

Advertisements