సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పాలన ‘రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదువలేదు’ అన్న చందాన తయారైంది. మార్చి నుండి రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన అనంతరం వరుసగా చోటుచేసుకున్న పరిణామాలతో ఆందోళన చెందిన అధి కార పార్టీకి పోలింగ్‌ పూర్తయినా ఎన్నికల సంఘం కబంధ హస్తాల్లో ఉండిపోయామన్న బాధ స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం కోడ్‌ను ఉల్లంఘించారని ఇద్దరు ఎస్పీలతోపాటు, ప్రభుత్వ నిఘావర్గాల అధిపతి ఏబీ వెంకటేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్‌చంద్ర పునేఠలపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే కొత్త సీఎస్‌గా రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను కొత్త సీఎస్‌గా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

game 27032019

దీంతో ఆయన ఏప్రిల్‌ 6వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టారు. సీఎస్‌ బాధ్యతల నుండి తొలగించిన అనిల్‌చంద్ర పునేఠను ఎన్నికలకు సంబంధం లేని విధులు అప్పగించాలని కేంద్ర ఎన్నికల సంఘం తన ఆదేశాలలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఇంతవరకూ ఆయనకు ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వకపోవడంతో ఇప్పుడు రాష్ట్ర ఐఏఎస్‌ అధికారుల్లో చర్చనీయాంశమైంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో తన సర్వీసును, తన హోదాను కూడా లెక్కచేయకుండా ఐఏఎస్‌ అధికారిగా తన మూడుదశాబ్ధాల అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఆయన్ను పక్కన పెట్టిన తీవ్ర దుమారాన్ని లేపాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అనిల్‌చంద్ర పునేఠ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.

game 27032019

”నా 30 ఏళ్ల ఐఏఎస్‌ సర్వీసులో ఎలాంటి మచ్చ లేకుండా పనిచేశాను. ఈనెల 31 పదవీ విరమణ చేసే సమయంలో ఇటువంటి అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కొనడం చాలా ఇబ్బందిగా ఉంది..” అంటూ అనిల్‌చంద్ర పునేఠ తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ”నాకు భవిష్యత్తులో ఎలాంటి ఆశలూ లేవు.. ఏపార్టీకి చెందిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ముఖ్యమంత్రుల అభిప్రాయాలకు, నిర్ణయాలకు అనుగుణంగానే పరిపాలన ఉంటుంది..” అని పునేఠ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాజకీయా ప్రయోజనాలకు అధికారులు బలి కావడం ఏమేరకు సమంజసమని పలువురు సీనియర్‌ ఐఏఎస్‌లు, ఐఏఎస్‌ అధికారులు నిలదీసినట్లు తెలిసింది. మళ్ళీ చంద్రబాబు సియం అవ్వగానే, చీఫ్ సెక్రటరీగా పునేఠను నియమిస్తే, ఆయన గౌరవంగా సర్వీస్ నుంచి పదవీ విరమణ పొందుతారు. అప్పటి వరకు ఆగకుండా, కనీసం ఇప్పుడైనా, ఎన్నికల కమిషన్ ఎదో ఒక పోస్టింగ్ ఇస్తే, ఆయన సర్వీస్ కు గౌరవం ఉంటుందని పలువురు అంటున్నారు...

Advertisements