రాఫెల్ డీల్ వివాదంపై రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. రాఫెల్ కుంభకోణాన్ని రిలయన్స్‌కు ముడిపెడుతూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలకు అనిల్ అంబానీ ఇటీవల లీగల్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ సునీల్ జఖార్ ఇవాళ ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘‘రాఫెల్ డీల్‌పై ఆరోపణలు మానుకోవాలని రిలయన్స్ గ్రూప్ నుంచి నాకు లీగల్ నోటీసులు అందాయి. మిస్టర్ అనిల్ అంబానీ... నేను మళ్లీ చెబుతున్నాను... లోక్‌సభలో చెప్పినట్టు మీకంటే బాగా విమానాలు తయారుచేయగల నైపుణ్యం నాకుంది..’’ అని పేర్కొన్నారు. పేపర్‌తో చేసిన ఓ విమానం నమూనాను ఊపుతున్నట్టు ఓ ఫోటో కూడా జతచేశారు.

anil 24082018 2


‘‘నేను ఇంకా మంచి విమానాన్ని తయారుచేయగలను’’ అంటూ జఖార్ ఇటీవల పార్లమెంటులో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. విమానం బొమ్మ పట్టుకొని లోక్‌సభ వెల్‌లోకి వెళ్లిన ఆయన.. రాఫెల్‌ కాంట్రాక్టు తనకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాఫెల్‌ కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థ (రిలయన్స్ డిఫెన్స్)కు, తనకు ఆ రంగంలో అనుభవం సమానంగానే ఉందంటూ ఎద్దేవా చేశారు. రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందం విషయంలో ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆరోపణలు గుప్పిస్తున్న తీరును తప్పుపడుతూ అనిల్ అంబానీ ఈ మధ్యే కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు.

 

anil 24082018 3

అయితే తాజగా, రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో ఆరోపణలు సరికాదు అంటూ, కాంగ్రెస్ నేతలకు రిలయన్స్ నోటీసులు పంపించింది. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం తమకు ఉందని స్పష్టం చేశాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ కు ఈ నోటీసులు జారీచేశాయి. ఆయనతో పాటుగా ఇతర కాంగ్రెస్ ప్రతినిధులైన రణ్ దీప్ సూర్జేవాలా - అశోక్ చవాన్ - సంజయ్ నిరుపమ్ - అనుగ్రహ్ నారాయణ్ సింగ్ - ఊమన్ చాందీ - శక్తిసిన్హ్ గోహిల్ - అభిషేక్ మను సింఘ్వి - సునీల్ కుమార్ జఖార్ - ప్రియాంకా చతుర్వేదిల పేర్లను కూడా ఈ నోటీసుల్లో చేర్చింది. వీళ్లంతా రిలయన్స్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆ నోటీసుల్లో పేర్కొంది.

Advertisements