అమరావతి రాజధాని భవన నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సలహా మేరకు, రాజమౌళి లండన్ లోని, నార్మన్ ఫోస్టర్ ఆఫీస్ కి వెళ్లారు... రాజధాని డిజైన్ల పై నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ రెండు రోజుల పాటు నిర్వహించిన సదస్సులో మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌తో పాటు రాజమౌళి బృందం లండన్‌లో కలిసింది. ఈ బృందాన్ని సీఆర్‌డీఏ అధికారులు ప్రత్యేకంగా లండన్‌ తీసుకెళ్లారు.

అమరావతిలో భవనాల డిజైన్లు ఎలా ఉండాలనే దానిపై సదస్సులో రాజమౌళి ఒక ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ముఖ్యంగా, ఫోస్టర్స్ బృందానికి, మన చరిత్ర, సంస్కృతి, వారసత్వం తదితర అంశాలను... వాటిని ప్రతిబంభించేలా డిజైన్ లు ఉండాలని, రాజమౌళి చెప్పారు..

ఈనెల 23 నుంచి లండన్‌లో చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు... అక్కడే నార్మ‌న్ ఫోస్ట‌ర్ సంస్థ రూపొందించిన‌ భ‌వ‌న న‌మూనాల‌ను ఫైనలైజ్ చేయనున్నారు....

Advertisements