కర్ణాటక ఎన్నికల ఫలితాలు రాక ముందే, ఏయ్ చంద్రబాబు, దండయాత్రకు వస్తున్నాం అంటూ, ఛాలెంజ్ విసిరిన రాం మాధవ్ పరిస్థితి ఇప్పుడు తారు మారు అయ్యింది. అమిత్ షా తరువాత పార్టీకి నేనే అంటూ బిల్డ్ అప్ ఇచ్చిన రాం మాధవ్ ను సొంత పార్టీలోనే దూరం పెడుతున్నారు. దీని అంతటికీ కారణం మనోడు కాశ్మీర్ లో చేసిన విఫల ప్రయోగం. ఆయన చొరవతోనే కశ్మీరులో ఉత్తర, దక్షిణ ధ్రువాలుగా పేరొందిన పీడీపీ-బీజేపీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అయితే తరువాత పరిణామాలతో, శక్తిమంతుడైన నేత ఒక్కసారిగా ఫ్లాప్‌ల ఖాతాలో చేరిపోయారు. కశ్మీరు వైఫల్యంతో ఆయన ప్రభ మసకబారిపోయింది.

rammadhav 22062018 2

కశ్మీరు సంకీర్ణం సుస్థిరమని 3 నెలలుగా ఆయన చెబుతున్న మాటలన్నింటినీ అపహాస్యం చేస్తూ బీజేపీ అధినాయకత్వం కాశ్మీర్ లో సంకీర్ణ సర్కారుకు గుడ్‌బై చెప్పింది. పార్టీ అంతర్గత రాజకీయాలే కశ్మీరులో ఆయన ప్రయోగానికి గండి కొట్టాయని కొందరంటుంటే, పీడీపీ సర్కారుతో రాంమాధవ్‌ మెతకవైఖరి దేశవ్యాప్తంగా పార్టీ ప్రతిష్ఠను దెబ్బ తీస్తుందనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన మరోవైపు వినిపిస్తోంది. రాంమాధవ్‌ మొదటి నుంచీ పీడీపీ సర్కారుకు అండగా నిలిచారు. దేశంలో ఒక్క కశ్మీరులోనే జాతీయ పతాకానికి అవమానం జరగలేదని, ఛత్తీ్‌సగఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో జాతీయ పతాకానికి ఆహ్వానం కూడా లభించదన్నారు. అయితే ఇప్పుడు మాత్రం, రాం మాధవ్ ట్యూన్ మారింది.

rammadhav 22062018 3

రాంమాధవ్‌ పూనికతోనే జమ్ము కాశ్మీర్‌లో మిలిటెంట్లకూ, ప్రభుత్వానికి మధ్యవర్తిగా వ్యవహరించేందుకు 2017 అక్టోబర్‌ 25న ఐబీ మాజీ డైరెక్టర్‌ దినేశ్‌ శర్మను నియమించారు. ఏడాది కాకముందే పీడీపీకి మద్దతు ఉపసంహరించారు. చర్చలు ఏమయ్యాయో, దినేశ్‌ శర్మ ఏం చేశారో రాంమాధవ్‌ చెప్పలేక పోయారు. కర్ణాటకలో ఫలితాలు పూర్తిగా వెలువడకముందే ‘‘చంద్రబాబు పని అయిపోయింది, దక్షిణాదిన బీజేపీ దండయాత్ర మొదలవుతుంది’’ అని రాంమాధవ్‌ ట్వీట్‌ చేశారు. చివరకు కర్ణాటకలోనే పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. ఇప్పుడు ఇన్‌ఛార్జిగా ఉన్న జమ్ము కాశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని బీజేపీయే స్వయంగా కూల్చేసుకుంది. సంకీర్ణ ప్రభుత్వాలను బీజేపీ నడపలేదన్న విషయంమరోసారి స్పష్టమైంది. కాశ్మీర్‌లోనే విఫలమైన రాంమాధవ్‌ దక్షిణాది దండయాత్ర ఎలా ప్రారంభిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈశాన్యం, ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల్లోనూ తలదూరుస్తున్న రాంమాధవ్‌ దూకుడుకు కాశ్మీర్‌ వైఫల్యం తర్వాత బ్రేకులు పడవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

Advertisements