రాష్ట్ర ఎన్నికల‌ కమీషనర్‌గా తన సామాజికవర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను చంద్రబాబు నియమించుకున్నారని, ఒకే సామాజికవర్గానికి చెందిన వీరిద్దరూ కల‌సి ఎన్నికను వాయిదా వేశారని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నియమించిన రమేష్‌ వ‌ల్ల‌ ఎన్నికలు ఆగిపోయాయని, స్థానిక ఎన్నికల్లో వైకాపా స్వీప్‌ చేస్తుందని భయపడి తన కులానికి చెందిన చంద్రబాబుకు మేులు చేయడానికే ఎన్నికల‌ కమీషనర్‌ రమేష్‌కుమార్‌ ఎన్నికల‌ను వాయిదా వేశారని ఆయన విమర్శించారు. అయితే నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఎన్నికల‌ కమీషనర్‌గా సిఫార్సు చేసింది నాటి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ నర్సింహ్మన్‌. త‌న వ‌ద్ద సెక్ర‌ట‌రీగా ప‌ని చేసిన ర‌మేష్ ను గవర్నర్‌గా ఉన్న నర్సింహ్మన్‌ సిఫార్సు వల్లే ఎన్నికల‌ కమీషనర్‌గా నియమింపబడ్డారు. వాస్తవానికి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు రాష్ట్ర ఎన్నికల‌ కమీషనర్‌గా బిశ్వాల్ ను నియమించాల‌ని భావించారు. అయితే అప్పటి గవర్నర్‌ జోక్యంతో నిమ్మగడ్డకు ఆ పోస్టు వచ్చింది.

nimmagaddaa 15032020 2

అంతకు ముందు కూడా నిమ్మగడ్డ చంద్రబాబు వద్ద ఎప్పుడూ పనిచేయలేదు. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రమేష్‌కుమార్‌ మూడు సంవత్సరాల‌ పాటు ప్రాధాన్యతకల‌ పదవుల‌ను నిర్వహించారు. మొదటి నుంచి రమేష్‌ చంద్రబాబు వ్యతిరేక వర్గంలోనే ఉండేవారు. నాటి గవర్నర్‌ సిఫార్సు వ‌ల్ల‌ రమేష్‌కుమార్‌కు ఆ పదవి వచ్చింది కానీ, చంద్రబాబు వల్ల కాదు. రమేష్ కుమార్ గారు, వైఎస్ఆర్ ప్రభుత్వంలో 2004 నుండి 2009 వరకూ నగరాభివృద్ది శాఖ,ఆర్ధికశాఖ కార్యదర్శలుగా పనిచేశారు. ఆ తర్వాత గవర్నర్ దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీగా 7 ఏళ్ళు చేశారు. ఆయన కలెక్టర్ గా పని చెయ్యటం మొదలు పెట్టిన దగ్గర నుండి నేటికి ఒక్క తప్పుపని చెయ్యలేదు. అందుకే గవర్నర్ కూడా ఎన్నికల అధికారిగా ఆయన ఉంటే బాగుంటుందని చెప్తే అప్పటి ముఖ్యమంత్రి తననే ప్రతిపాదించారు.

nimmagaddaa 15032020 3

ఎలక్షన్ కమీషన్ నిర్వహించవలసిన పనులను రాష్టప్రభుత్వం కాదు ఇచ్చేది. రాజ్యాంగం ప్రకారం ఎప్పుడు ఏమి చెయ్యాలో భారత ఎన్నికల శాఖ నియమావళిని పెట్టింది. దానినే రాష్ట్ర శాఖ అమలు చేస్తుంది. భాధ్యతగల పదవిలో ఉన్న వారు నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడటం కాదు బుద్ది ఉండాలి. జగన్ చేసిన ఇదే ఆరోపణ పై చంద్రబాబు కూడా స్పందించారు. "రమేష్ ని కూడా నేను రికమండ్ చెయ్యాలా .. నేను సీఆర్ బిశ్వల్ ని రికమెండ్ చేస్తే .. గవర్నర్ నరసింహన్ ..రమేష్ ఐతే బాగుంటదని అంటే .. గవర్నర్ మాటని కాదనటం ఎందుకులే అని యాక్సెప్ట్ చేసాను" అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే ఇలా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కులం ఆపాదించటం, అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

Advertisements