చౌకధర దుకాణాలను గ్రామీణ మాల్స్‌గా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ దుకాణాల ద్వారా బ్రాండెడ్‌ సరకులను తక్కువ ధరకే కార్డుదారులకు విక్రయించే ప్రక్రియలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మరో అడుగు వేసింది. ఇక నుంచి, రేషన్ షాపులు, మినీ సూపర్ బజార్ లు లాగా మారనున్నాయి.

సుమారు 200 రకాల బ్రాండెడ్‌ సరకులను ఎమ్మార్పీపై 20 నుంచి 40 శాతం ధర తగ్గించి సరఫరా చేయాలి. ఇలా తగ్గిన ధరలో 60శాతం కార్డుదారులకు, మిగిలిన 40శాతం రేషన్‌ డీలర్లకు కమీషన్‌ అందేలా ప్రాధమికంగా నిర్ణయించారు. ముందుగా విజయవాడ, గుంటూరులో ప్రయోగాత్మకంగా ఈ విలేజ్‌ మాల్స్‌ ఏర్పాటు చేస్తారు. వాల్‌మార్ట్‌, రిలయన్స్‌, బిగ్‌బజార్‌ సంస్థలతో ఇప్పటికే ఒక ఒప్పందం కుదుర్చుకొన్నది. ఆయా సంస్థల నుంచి సరుకులను ప్రభుత్వం కొనుగోలు చేసి విలేజ్‌మాల్స్‌కి సరఫరా చేస్తుంది.

విజయవాడలో, చిట్టినగర్ సమీపాన చెరువు సెంటర్ లోని 115వ నెంబర్ డిపో, సత్యనారాయణపురంలోని 214వ నెంబర్ డిపోలో ముందుగా ప్రారంభిస్తారు. వీటికి సరుకులు వాల్మార్ట్ అందించనుంది. ఇప్పటికే ఆ షాపులకు కావాల్సిన అరలు, మిగతా రిక్వైర్మెంట్స్ సిద్ధం చేస్తున్నారు.

ఒక్కో కుటుంబానికి నెలకు రూ. 2,500 వరకు నిత్యావసర సరుకుల రూపంలో ఖర్చు అవుతున్నట్లు సర్వే ద్వారా తేలింది. దాదాపు 200 రకాల సరుకులు, 20 నున్హి 40 శాతం తక్కువ రానుండటంతో, దాదాపు ఒక్కో కుటుంబానికి 500 రూపాయల వరకు ఆదా అయ్యే అవకాసం ఉంది. దీని ద్వారా ఇటు పేద ప్రజలకు లాభ్దే కాకుండా, అటు డీలర్ కూడా ఎక్కవ సంపాదించే అవకాశం ఉంది.

Advertisements