నోటి దురుసుతో, బూతులతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలని బెంబేలెత్తించిన రోజా, ఇప్పుడు కువైట్‌లో కూడా అదే హడావిడి చేసి ఆబాసుపాలైంది...

కువైట్‌లోని ఓ హోటల్‌లో వైకాపా కువైట్‌ విభాగం సభ్యులు ఏర్పాటు చేసిన ‘నవరత్నాలు’ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. కువైట్‌లో ‘నవరత్నాలు కార్యక్రమం ఏంటో వాళ్ళకే తెలియాలి...

అయితే అక్కడ ఈ బ్యాచ్ అంతా హడావిడి చేశారు... ఆంధ్రప్రదేశ్ అనుకున్నారో, లేక అక్కడ ఉంది చూసి చూడనట్టు వదిలేసే చంద్రబాబు అనుకున్నారో, కువైట్‌లో రెచ్చిపోయారు... పార్టీ శ్రేణులు చేసిన హంగామా శృతిమించటంతో, స్థానిక పోలీసులు వచ్చి అందరినీ అరెస్ట్ చేశారు... జై జగన్ జై జగన్ అంటుంటే, కువైట్‌ పోలీసులకి ఏమి అర్ధం కాక, మొత్తాన్ని లోపాలకి తోసారు.. చివరకి తేలింది ఏంటి అంటే, అక్కడ పర్మిషన్ కూడా లేకుండా వీళ్ళు హడావిడి చేస్తున్నారు అని.

ఈ సందర్భంగా రోజాను కూడా అరెస్ట్ చేశారు... కాని వెంటనే విడుదుల చేసినట్టు సమాచారం... అయితే రోజా మాత్రం తనను ఎవరూ అరెస్ట్ చెయ్యలేదని, నిర్వాహకులని మాత్రమే అరెస్ట్ చేశారని ఒక వీడియో బైట్ వదిలారు....

Advertisements