తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ సబ్బం హరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతారనడానికి విశాఖ పర్యటనే ఓ ఉదాహరణ అన్నారు. ఆయనను చూడటానికి వేలాది మంది వచ్చారని చెప్పుకోవడం కంటే పచ్చి అబద్ధం మరొకటి ఉండదన్నారు. ఆయన ఎయిర్ పోర్టులో దిగి స్వరూపానందేంద్ర పీఠం వరకు లెక్కపెడితే 150 నుంచి 200 మంది కంటే ఎక్కువ మంది ఉన్న ఒక్క వీడియో క్లిప్ అన్నా చూపాలని కోరారు. ఆయనను చూడటానికి వచ్చిన వారిలో 30 మంది తెలంగాణ పోలీసులే ఉన్నారని చెప్పారు. ఒకవేళ క్లిప్ చూపిస్తే.. మరోసారి కేసీఆర్‌పై విమర్శలు చేయనన్నారు. ఓ టీవీ ఛానల్‌ చర్చావేదికలో సబ్బం ఈ విషయాలు తెలిపారు.

sabbam 030120219

మరో పక్క ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ కూడా కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘‘ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రధాని మోదీ ఈర్ష్యపడుతున్నారు. చాయ్‌ అమ్ముకొని దేశ ప్రధాని అయ్యాడు కదా... కనీస మానవత్వం ఉంటుందని అనుకున్నాం. అయితే రాజధాని నిర్మాణం కోసం కేవలం మట్టి, నీరు తీసుకొచ్చి ఇదే సహాయం అన్నట్లుగా వ్యవహరించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోదీని.. జగన్‌, పవన్‌ ప్రశ్నించాల్సింది పోయి సీఎం చంద్రబాబుపై నిందలు వేస్తున్నారు. మోదీ, కేసీఆర్‌, జగన్‌ ముగ్గురూ కుమ్మక్కయ్యారు’’ అని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ మాట్లాడుతూ, ‘‘పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు ఎలా మాట్లాడాలో తెలియడం లేదు’’ అని విమర్శించారు.

sabbam 030120219

‘‘దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోల్చితే అన్ని రంగాల్లో 10.5 శాతం వృద్ధిరేటుతో ఏపీ ముందుందని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్‌ను చంద్రబాబు అభివృద్ధి చేస్తే ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నారు. టీఆర్‌ఎ్‌సను గెలిపిస్తే దళితులను సీఎం చేస్తానన్న కేసీఆర్‌... కొడుకుని, అల్లుడిని మంత్రులను చేసుకుని ఆయనే మరోసారి సీఎం సీటులో కూర్చున్నారు’’ అని సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి నెల్లూరు జిల్లా పిడూరుపాళెంలో అన్నారు. ‘‘పిచ్చివాడి చేతిలో రాయిలా దొరికిన పదవితో కేసీఆర్‌ హద్దుమీరి ఏపీ సీఎం చంద్రబాబుపై పేలుతున్న కూతలను కట్టిపెట్టాలి. సీఎం స్థాయిలో ఉన్న కేసీఆర్‌ సాటి సీఎం చంద్రబాబును ఉద్దేశించి చెప్పనలవి కాని పదజాలం వాడడం పట్ల సభ్యసమాజం చీదరించుకుంటోంది.’ అని ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య అన్నారు.

Advertisements