జగన్ మోహన్ రెడ్డితో సావాసం చేసే ఏమవుతుందో, రాజశేఖర్ రెడ్డితో పని చేసిన ఐఏఎస్ ఆఫీసర్ లకి బాగా తెలుసు... అప్పటి వరకు టాప్ ఐఏఎస్ లుగా పేరు ఉన్నవారు కూడా, జగన్ సావాసంతో జైల్లో కూర్చున్నారు... నిన్న కాక మొన్న, ప్రధాని మోడీకి కూడా శాంపిల్ చూపించాడు మనోడు... ఇంకా జగన్ పార్టీతో కలవకుండానే, మనోడు చేసిన పనికి, ఇంటర్నేషనల్ కోర్ట్ మోడీకి నోటీసు ఇచ్చింది... ఇప్పటికైనా మనోడు ఎంత ప్రమాదికారో అర్ధమైందా ? కాని కొంత మంది ఉంటారు, జగన్ ను చూస్తే పాపం ఆనందం ఆపుకోలేరు... అదే వాళ్ళకు తిప్పలు తెచ్చి పెడుతుంది... ఈ రోజు కూడా అదే జరిగింది...

jagan 25022018 2

జగన్‌ పాదయాత్ర సందర్భంగా కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని కస్తూర్బా స్కూల్‌ విద్యార్థులు వైఎస్సార్‌ అక్షరాకృతిలో ప్రదర్శన ఇవ్వడంపై ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. ప్రత్యేకాధికారి సుజాత, పీఈటీ వరలక్ష్మిల ను సస్పెండ్‌ చేశారు. ఆమేరకు కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జగన్‌ ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కస్తూర్బా స్కూల్‌ మీదుగా శనివారం వెళ్తుండగా బాలికలు వైఎస్సాఆర్‌ అక్షరాకృతిలో కుర్చొని స్వాగతం పలికారు.

jagan 25022018 3

నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థినులను తరగతులకు డుమ్మా కొట్టించి, ర్యాలీగా వస్తున్న రాజకీయ పార్టీల నేతలకు స్వాగతం పలికించారని ఎమ్మెల్యే బాబూరావు కలెక్టర్‌కు, సర్వశిక్షా అభియాన్‌ పీవోకు ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. దీంతో అసిస్టెంట్‌ జీసీడీవో హేమలత, సీఎంవో కొండారెడ్డి కస్తూర్బా స్కూల్‌కు వెళ్లి విచారణ చేపట్టారు. తొలుత ఎస్‌ వో సుజాతను సంజాయిషీ కోరుతూ మెమో జారీ చేసిన అధికారులు, విచారణ అనంతరం ఆమెతోపాటు, పీఈటీపై చర్యలు తీసుకున్నారు.

Advertisements