ఇది నిజంగా సంచలనమే.. ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడూ ఇలా అగ్రెసివ్ గా ఉండరు. చాలా ఆచి తూచి, సాగ దీసి, సవర దీసి, ఉండే నైజం ఆయనది. పోనీలే మారతారు అంటూ వదిలేస్తూ ఉంటారు. అయితే, ఇప్పుడు ఏకంగా ఒక సిట్టింగ్ ఎమ్మల్యేని పార్టీ నుంచి సస్పండ్ చేసారంటే అది నిజంగా సంచలనమే. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ. ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటంతో పాటు వైసీపీలో చేరబోతున్నారనే వార్తలు రావడంతో పార్టీ కార్యకర్తల ఏకగ్రీవ తీర్మానం మేరకు మేడాపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సస్పెన్షన్ వేటు వేశారు. కడప జిల్లా రాజంపేట, జమ్మలమడుగు నేతలు, కార్యకర్తలతో సీఎం తన నివాసంలో సమావేశమయ్యారు. అనర్హుడికి అందలమెక్కించారని, మేడాను సస్పెండ్‌ చేయాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో మేడాను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు చంద్రబాబు సమావేశంలోనే ప్రకటించారు.

cbn 2201201 1

మేడా పార్టీ వీడడం ఖాయమని తేలిపోవడంతో రాజంపేట టికెట్‌ ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు, తానా అధ్యక్షుడు వేమన సతీష్‌, రాజు స్కూళ్ల అఽధినేత జగన్‌మోహన్‌రాజు, మహిళా నేత పత్తిపాటి కుసుమకుమారి, రెడ్‌బస్‌ యాప్‌ అధినేత చరణ్‌కుమార్‌రాజు తదితరులు రాజంపేట టికెట్‌ ఆశిస్తున్నారు. ఇక మేడా తప్పుకున్నట్లేనన్న భావనలో ఉన్న ఈ నేతలు ఎవరికి వారు టికెట్ల రేసులో ఉన్నట్లు సమాచారం. మంగళవారం జరిగే సీఎం సమీక్షకు ఈ నేతలు భారీగా వాహన శ్రేణిని ఏర్పాటు చేసి బలప్రదర్శనకు సిద్ధమయ్యారు.

cbn 2201201 1

సోమవారం సాయంత్రమే పసుపులేటి బ్రహ్మయ్య, వేమన సతీష్‌ తదితరులు తమ అనుచరులను వాహనాల్లో అమరావతికి పంపారు. రెడ్‌బస్‌ యాప్‌ వ్యవస్థాపకుడు చరణ్‌కుమార్‌రాజు సోమవారం ఉదయం పోట్లదుర్తిలో ఎంపీ సీఎం రమే్‌షను కలిసి ఈసారి టికెట్‌ ఇప్పించాలని కోరినట్లు సమాచారం. మంగళవారం జరిగే సీఎం సమీక్షకు హాజరు కావాలని సీఎం రమేష్‌ చరణ్‌రాజును కోరారు. రాజంపేట టీడీపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతుండడంతో తెర పైకి కొత్త కొత్త నేతలు వస్తున్నారు. రాజంపేట ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకున్న తరువాత ధీటైన అభ్యర్థి ఎవరన్నది గుర్తించి ప్రకటించే అవకాశముందని ఆ పార్టీ ముఖ్య నేత తెలిపారు.

Advertisements