నిత్యం తప్పుడు సమాచారాన్ని ఇస్తూ, కేంద్రం ఏపి ప్రజల చెవుల్లో పూలు పెడుతోందని ఆరోపించిన చిత్తూరు ఎంపీ, నటుడు శివప్రసాద్‌, వినూత్నంగా తన చెవుల్లో కాలీఫ్లవర్‌ పెట్టుకుని నిరసన తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, పవన్‌, జగన్‌లను ముందు పెట్టుకుని నరేంద్ర మోడీ కుట్రా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసిపి ఎంపీలు మాయ మాటలతో ప్రజలను మోసగిస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాలపై వారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రాభివ అద్ధికి అడ్డుపడుతున్న మోదీ, అమిత్‌ షాలను ప్రజలు క్షమించబోరని చెబుతూ ''ఆల్‌ పువ్వులూ ఆర్‌ స్పాన్సర్డ్‌ బై బీజేపీ'' అంటూ వ్యంగ్యోక్తులు విసిరారు.

sivaprasad 05062018 2

2015 నుంచి రాజీనామాలంటూ వాయిదా వేస్తూ ఇప్పుడు డ్రామాను రక్తికట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చెవిలో పువ్వులు, క్యాలీఫ్లవర్ పెట్టుకుని మరీ ఎంపీ శివప్రసాద్ నిరసన తెలిపారు. కళాకారుడిగా వినూత్నరీతిలో నిరసన తెలిపానని ఎంపీ అన్నారు. మోదీ డైరెక్షన్‌లో వైసీపీ పనిచేస్తోందని ఆరోపించారు. మాయమాటలతో ప్రజలను ఎంతో కాలం మోసగించలేరన్నారు. వైసీపీ నేతల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎంపీ అన్నారు.

sivaprasad 05062018 3

పవన్‌, జగన్‌తో కలిసి మోదీ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కుటుంబం లేని మోదీకి ప్రజల బాధలు ఏం అర్థమవుతాయని ఎద్దేవా చేశారు. పవన్‌కల్యాణ్‌ పరిపక్వత లేని నాయకుడని ఎంపీ వ్యాఖ్యానించారు. పవన్‌ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. స్వచ్ఛభారత్ గురించి మోదీ ఉపన్యాసాలు చెబుతారని అసలు మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలోనే శుభ్రత లేదని అన్నారు. జీవితంతో ఒక్కసారైనా చూడాలని ప్రజలు ఆశపడే కాశీలో పరిశుభ్రత మచ్చుకైనా కానరాదని ఎంపీ శివప్రసాద్ విమర్శలు గుప్పించారు.

 

Advertisements