విశాఖపట్నం జిల్లాలో తన పర్యటన ప్రారంభమైన నాటి నుంచి (3 నెలలుగా) విమానాశ్రయంలో సీసీ కెమెరాలు పనిచేయడం మానేశాయని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని విమానాశ్రయం డైరెక్టర్‌ జి.ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు ఖండిచారు. ఎయిర్ పోర్ట్ లో 65 సిసి కెమెరాలు ఉన్నాయని చెప్పారు. అవన్నీ పని చేస్తూనే ఉన్నాయని అన్నారు. ఒక్క కెమెరా ఆఫ్ అయినా, మాకు అలెర్ట్ వచ్చేస్తుందని చెప్పారు. ఏదన్నా రిపేర్ వచ్చినా, అరగంటలో రిపేర్ చేసేస్తామని అన్నారు. నెల రోజుల వరకు, ఉన్న ఫూటేజ్ బ్యాకప్ ఉంటుందని తెలిపారు. ఎయిర్ పోర్ట్ లో సిసి కెమెరాలు లేవు అనేది అబద్ధపు ప్రచారమని చెప్పారు.

jagan 18012019

‘విశాఖ విమానాశ్రయంలో మొత్తం 65 సీసీ కెమెరాలు ఉన్నాయి. అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి. ఏదైనా కెమెరా పనిచేయకపోతే వెంటనే తెలిసిపోతుంది. అరగంటలో రిపేర్‌ చేస్తాం. విమానాశ్రయంలో నెల రోజుల ఫుటేజీ కూడా ఉంటుంది. జగన్‌పై దాడి జరిగిన రోజు(అక్టోబరు 25) కూడా సీసీ కెమెరాలు పనిచేశాయి. ఆ ఫుటేజీతోపాటు అంతకుముందు నెల రోజులు ఫుటేజీని పోలీసులకు అందజేశాం. మొత్తం 16 హార్డ్‌డి్‌స్కల సమాచారాన్ని పోలీసులు తీసుకెళ్లారు. ఎవరో కావాలనే సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అవన్నీ అసత్య ప్రచారాలు, ఎయిర్ పోర్ట్ లో సిసి టీవీలు ఎప్పుడూ ఆన్ లోనే ఉంటాయి. అన్ని ఆధారాలు పోలీసులకు ఇచ్చాం’ అని ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు.

jagan 18012019

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) నిర్వహించే విమానాశ్రయాల్లో ప్రముఖులు విశ్రాంతి తీసుకునే ప్రాంతాన్ని ‘వీఐపీ లాంజ్‌’గా పేర్కొంటారు. ఏఏఐ పరిభాషలో దానిని ‘రిజర్వుడ్‌ లాంజ్‌’గా వ్యవహరిస్తారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకూడదని బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బీసీఎస్‌) నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆ లాంజ్‌లోకి వెళ్లే మార్గం, వచ్చే మార్గం సీసీ కెమెరాల పరిధిలో ఉంటాయి. కానీ లోపల ఏమి జరుగుతున్నదీ రికార్డు చేయడానికి ఎటువంటి కెమెరాలు ఉండవు. జగన్‌పై ఇదే లాంజ్‌లో దాడి జరిగింది. అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆ ఘటన రికార్డు కాలేదన్నారు.

 

Advertisements