శ్రీకాకుళంలో ప్రవేశించిన జగన్ మోహన్ రెడ్డికి, జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు వచ్చాయి. ఆదివారం సాయంత్రం కాశీబుగ్గ ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు ప్ల కార్డులు పట్టుకొని నిరసన చేపట్టారు. ఏ మొహం పెట్టుకొని జిల్లాలో జగన్‌ ప్రజాసంకల్పయాత్ర నిర్వహిస్తారని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీష ప్రశ్నించారు. శిరీష మాట్లాడుతూ తితలీ తుపానుతో ప్రజలు సర్వస్వం కోల్పోతే పట్టకుండా వ్యవహరించడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు, ఇతర మంత్రులు, రాష్ట్ర యంత్రాంగమంతా వచ్చి సహాయ చర్యలు చేపట్టడం ఈ ప్రాంత ప్రజలు మరువలేదన్నారు. రికార్డుస్థాయిలో తక్కువ వ్యవధిలో బాధితులకు పరహారం అందిందన్నారు. కానీ జగన్‌ పక్క జిల్లాలో ఉన్నా కనీసం పరామర్శించిన పాపాన పోలేదన్నారు.

jagan 26112018 2

ఆయనకు జిల్లాలో అడుగు పెట్టడానికి అసలు అర్హతే లేదన్నారు. ప్రజలు ప్రశ్నించాలని, రాబోయే ఎన్నికల్లో ఆయనకు తగురీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోకుండా..ఇప్పుడు సిగ్గు లేకుండా పాదయాత్రకు బయలుదేరారని జగన్‌పై మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో రాజాంలో ఆదివారం భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి..అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద మాన వహారం చేపట్టారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోండ్రు మురళీమోహన్‌ మాట్లాడుతూ తితలీ బాధితులకు సీఎం చంద్రబాబు కన్నతండ్రిలా ఆదుకున్నారని కొనియాడారు. బాధితుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.

jagan 26112018 3

గంటల వ్యవధిలో వెళ్లి పరామర్శించడానికి అవకాశం ఉన్నా జగన్‌ ముఖం చాటేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ మూల్యం చెల్లించుకుంటారన్నారు. జిల్లా ప్రజలకు జగన్‌ క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆయన మాట్లాడుతూ, విపక్ష పాత్రను కూడా సరిగ్గా చేపట్టడం లేదని ఎద్దేవా చేశారు. జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఆటవిడుపు యాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. పాద యాత్రకు ఒక ల క్ష్యం, సిద్ధాంతం లేదన్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమ యంలో రెండు లక్షల ఎక రాల ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన ఘనుడు జగన్‌ అన్నారు.. అటువంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తి జిల్లాలో పాదయాత్రకు అడుగుపెట్టడం దురదృష్టకరమన్నారు. సుమారు రెండున్నర లక్షల కుటుంబాలు తితలీ తుపానుతో నష్టపోతే...ఒక్క కుటుంబాన్ని పరామర్శించే తీరిక లేకపోవడం దారుణమన్నారు. కోడికత్తి డ్రామాలకు ఉన్న సమయం తితలీ బాధితుల పరామర్శకు లేదా అని ప్రశ్నించారు. పాదయాత్ర చేసే హక్కు జగన్‌కు లేదని... ప్లకార్డులు పట్టుకుని జగన్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisements