కోడి కత్తితో జగన్ ను గుచ్చిన కేసులో, పోలీసులు విచారణ ముమ్మరం చేసారు. విచారణలోకి వెళ్ళే కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్ పై కోడి కత్తి దాడి చేసిన శ్రీనివాస్‌కు నాలుగు సెల్ ఫోన్లతో పాటు, ఒక ట్యాబ్‌ ఉన్నట్టు విచారణలో తేలింది. ఇవన్నీ పోలీసులు సీజ్ చేసి, వాటిలో ఉన్న డేటాతో పాటుగా, కాల్ డేటా కూడా అనలైజ్ చేస్తున్నారు. అలాగే, శ్రీనివాస్ ఉంటున్న ఫ్లాట్ లో, వేరే గదిలు ఉండేవని, కొద్ది రోజుల క్రితం వరకు, వాటిలో ఇద్దరు అమ్మాయిలు ఉండే వారనే సమాచారం వస్తుంది. వాళ్ళు కొద్ది రోజుల క్రిందటే ఆ గది ఖాళీ చేసి వెళ్లిపోయారని తెలుస్తుంది. శ్రీనివాస్ తో పాటు అతనితో పాటు రాజు అనే వ్యక్తి, మరో యువకుడు ఒక గదిలో, మరో గదిలో ఇద్దరు అమ్మాయులు ఉండేవారని సమాచారం రావటంతో, అది ఎంత వరకు నిజం అనే విషయం పై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

kodikathi 29102018 2

మరో పక్క, నిందితుడు శ్రీనివాస్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో పలు ఆసక్తికర అంశాలను చేర్చారు. తాను వైసీపీ అభిమానిగా విచారణలో చెప్పిన శ్రీనివాస్‌.. జగన్‌పై దాడి చేస్తే సానుభూతితో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. జగన్‌ 12 గంటల 30 నిమిషాలకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారని, 8 నిమిషాల తర్వాత.. అతనిపై దాడి జరిగినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో తెలిపారు. దాడి సమయంలో జగన్‌ పక్కకు తిరగడంతో కత్తి భుజానికి తగిలిందని వెల్లడించారు. జగన్‌ ఈ నెల 25నే ఎయిర్‌పోర్ట్‌కు వస్తారని ముందే తెలుసుకున్న శ్రీనివాస్.. కత్తులు ఎయిర్‌పోర్టులోకి తీసుకొచ్చి సీసీ కెమెరాలు కవర్‌ చేయని ప్రాంతంలో దాచినట్లు పేర్కొన్నారు. అలాగే నిందితుడు శ్రీనివాస్‌ ఏడాది కిందటే దుబాయ్‌ నుంచి వచ్చినట్లు తెలిపారు.

kodikathi 29102018 3

జగన్‌పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు జనవరిలోనే కత్తి తీసుకొచ్చి వంటగదిలో ఉంచాడని విశాఖ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ చంద్ర లడ్డా తెలిపారు. నిందితుడి నుంచి నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, అతడు వాడిన మరో ట్యాబ్‌ స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు. శ్రీనివాసరావు సహ ఉద్యోగిని విజయ 9 పేజీల లేఖను రాయగా, రేవతి అనే మహిళ మరో పేజీ లెఖ రాశారని వివరించారు. మరోవైపు అతడికి మూడు బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించామన్నారు.. దాడి కేసులో విచారణ వేగవంతం చేశామని.. త్వరలోనే అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తామన్నారు సిట్‌ అధికారి. నవంబర్ రెండు వరకు శ్రీనివాస్‌ను ఇంటరాగేట్ చేసేందుకు అనుమతి ఉందన్నారు. అతి త్వరలోనే ఈ ఘటన వెనుక ఎవరున్నారనేది విచారణలో బయటపడుతోందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.

Advertisements