హేళనగా.. అవమానకరంగా, అమరావతిని భ్రమరావతి అని మాట్లాడినవారికి అభివృద్ధే సమాధానంగా ముఖ్యమంత్రి సమాధానం చెప్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఉన్నత విద్యా కేంద్రంగా మారనుంది. కొన్నేళ్లుగా విజయవాడ, గుంటూరు విద్యాకేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. వీటికి అమరావతి కూడా తోడైతే ఈ ప్రాంతం విద్యా కేంద్రాల హబ్‌గా మారనుంది. అమరావతికి ఒక్క విద్యారంగంలోనే సుమారు రూ.25వేల కోట్లకుపైగా పెట్టుబడులు రానున్నాయని అంచనా. ఇది కూడా తొలి దశలోనే. ఇప్పటికే వెల్లూరు ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(విట్‌), ఎస్‌ఆర్‌ఎం, మాతా అమృతానందమయి తదితర సంస్థల వర్సిటీలు నెలకొల్పేందుకు అమరావతిలో భూమిని కేటాయించారు. రాజధాని ప్రాంతంలోని ఐనవోలు, శాఖమూరు ప్రాంతాల్లో వీటికి భూములిచ్చారు.

srm 03062018 2

ఇప్పటికే ఎస్‌ఆర్‌ఎం, విట్‌ యూనివర్సిటీ తరగతలు కూడా మొదలు పెట్టాయి. అయితే, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ మొదలు పెట్టిన సమయానికి, ఇప్పటికీ చాలా నిర్మాణాలు జరిగాయి... అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ క్యాంపస్ చూస్తుంటే, కళ్ళు చెదిరేలా అతి పెద్ద నిర్మాణంలా ఉంది. చంద్రబాబు అంటున్నట్టు, వరల్డ్ క్లాస్ లా, నిర్మాణం జరిగింది.. రాష్ట్రప్రభుత్వం ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి 200 ఎకరాల భూమిని కేటాయించింది. పోయిన ఏడాది ఫిబ్రవరి 15న నిర్మాణ పనులు మొదలయ్యాయి. కేవలం ఐదు నెలల్లో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధానమైన అకడమిక్‌, అడ్మినిస్ట్రేషన్‌ బ్లాకులను నిర్మించి, మొదలు పెట్టారు. అప్పటి నుంచి, ఇప్పటికి చాలా నిర్మాణాలు జరిగాయి.

srm 03062018 3

2017-18 విద్యాసంవత్సరంలో నాలుగు బీటెక్‌ బ్రాంచ్‌లు.. కంప్యూటర్‌ సైన్స్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఎలక్ట్రికల్స్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో అడ్మిషన్లు చేపట్టారు. ఈ ఏడాది దాదాపు 300 అడ్మిషన్లు జరిగాయి. ఈ ఏడాది 70 శాతం అడ్మిషన్లు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు, 30 శాతం అడ్మిషన్లు రాష్ట్రేతరులకు కల్పిస్తున్నారు. ఎస్‌ఆర్‌ఎంలో మేనేజ్‌మెంట్‌ కోటా లేదు. క్యాపిటేషన్‌ ఫీజు లేదు. బీటెక్‌ విద్యార్థులకు ఏడాదికి ఫీజు రూ.2.5 లక్షలుగా నిర్ణయించారు. అమరావతిని ప్రపంచంలోనే పేరొందిన విద్యాకేంద్రంగా మలచాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేసే క్రమంలో భాగంగా అందులో దేశ, విదేశాలకు చెందిన పలు సుప్రసిద్ధ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు తమ క్యాంపస్‌లను నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నాయి... పూర్తి వీడియో ఇక్కడ చూడచ్చు https://youtu.be/agLvNTOhDwQ

Advertisements