రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష కార్యరూపం దాల్చబోతోంది. కడప ఉక్కు పరిశ్రమ గురించి కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయి, రాష్ట్రంపై కక్షగట్టిన కేంద్రాన్ని కదిలించేందుకు నిరాహార దీక్షలు చేసి పోరాడినా ఫలితం లేక చివరికి ముఖ్యమంత్రే మూడు ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్రం ముందుంచారు. అయినా కేంద్రం స్పందించలేదు. అలాగని ప్రజల ప్రయోజనాలను, మనోభావాలను పక్కన పెట్టలేక... క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో సైతం కడప జిల్లాలో వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఉక్కుపరిశ్రమను ఏర్పాటు చేయాలనుకున్నారు చంద్రబాబు.

rayalseema 14122018 2

మైలవరం మండలంలోని ఎం.కంబలదిన్నె గ్రామం వద్ద 3,147 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రెండు ప్రత్యేక ఎస్‌పీవీలను ఏర్పాటుచేసింది. ఈ ఉక్కుపరిశ్రమకు డిసెంబరు 27న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు గనుల శాఖ కార్యదర్శి బి.శ్రీధర్‌ అధికారికంగా ఉత్తర్వులు జారీచేశారు. మైలవరం మండలంలోని ఎం.కంబలదిన్నె గ్రామంలో పరిశ్రమను నెలకొల్పనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రెండు ఎస్‌పీవీలను ఏర్పాటుచేసింది.

rayalseema 14122018 3

ఉక్కు పరిశ్రమ ఎస్‌పీవీ వాటిలో మొదటిది. రాయలసీమ ఉక్కు సంస్థ లిమిటెడ్‌, ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో మరో మైనింగ్‌ ఎస్‌పీవీని ఏర్పాటుచేశారు. ఇది పరిశ్రమకు ఇనుప ఖనిజాన్ని సరఫరా చేస్తుంది. రాయలసీమ ఉక్కు సంస్థకు ఛైర్మన్‌, ఎండీగా పి.మధుసూదన్‌ను నియమించింది. బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ నియామకం, మూలధనం కింద రూ.2కోట్లు విలువ చేసే 20లక్షల షేర్లను ఒక్కొక్కటి రూ.10 చొప్పున కేటాయించే ప్రక్రియలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తిచేసింది.

Advertisements