పాత తరం ప్ర‌ముఖ హీరో సుమ‌న్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ పై హీరో సుమ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఓడిపోవడానికి పవన్‌కల్యాణే కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను పుట్టిన తర్వాత చూసిన ఎన్నికల్లో, ఒకే పార్టీకి ఇన్ని సీట్లు రావడం ఇదే మొదటిసారి అని తెలిపారు. సినిమా పరిశ్రమను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి అన్ని విధాలా ఆదుకోవాలని జగన్‌కు సూచించారు. శనివారం నాడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన సుమన్ పై వ్యాఖ్యలు చేశారు. అయితే సుమన్ చేసిన వ్యాఖ్యలపై అటు టీడీపీ, ఇటు జనసేన నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

మరో పక్క పవన్ పై రోజా కూడా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికల్లో జనసేన నుంచి, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయినా గెలిచివుంటే బాగుండేదని, వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియాతో తెలిపారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన ఓడిపోవడానికి మొదటి కారణం, వాళ్ళ అన్న పెట్టిన ప్రజారాజ్యం పార్టీనే అన్నారు. 2009లో చిరంజీవి అధ్యక్షడిగా ప్రజారాజ్యం పార్టీ తరుపున పోటీచేసి, అప్పట్లో 18 మంది ఎమ్మెల్యేలు గెలిచినా, ఆ పార్టీ నడపలేక అధినేత చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేశారని గుర్తు చేసారు. ఇప్పుడు కూడా పవన్ అదే రకంగా విలీనం చేస్తారేమో అని ప్రజల్లో సందేహం వల్లే జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ ను ప్రజలు దూరంగా పెట్టారని చెప్పారు.

Advertisements