టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య,  ముఖ్యమంత్రి జగన్‍కు లేఖ రాసారు. ఈ లేఖలో, ఆయన  అధికారంలోకి రాకముందు పాదయాత్రలో ఇచ్చిన హామీల గురించి జగన్ ను ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి రాకముందు పాదయాత్ర చేసినప్పుడు  దళితులు తమ ఆత్మబంధువులు అని, దళితులు అందరి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతామని చెప్పి ఎందుకు జగన్ అబద్దాలు, అసత్య వాగ్దానాలు చేసారని ఆయన లేఖలో ప్రశ్నించారు. మీకు ఓట్లేసి గెలిపించిన ఈ  దళితులపై ఇనుప పాదం మోపి ఎందుకు అణిచివేస్తున్నారని, ఇలా చేయడం ఈ ముఖ్యమంత్రికి  ఎమన్నా న్యాయంగా ఉందా అని, అంతే కాకుండా దళితులుపై జరిగే అఘాయిత్యాలను కూడా ఈ ప్రభుత్వం  అరికట్టాలని ఆయన డిమాండ్ చేసారు.

Advertisements