తెలంగాణలో పార్టీల బలాబలాలపై ఏఐసీసీ పలు సర్వేలు చేయించింది. దీనికి సంబంధించి కీలకమైన సమాచారం పార్టీ అధినేత రాహుల్ గాంధీ వద్ద ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలో షాకింగ్ రిజల్ట్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఐఏసీసీ దూతలు.. కాంగ్రెస్‌తో పాటు టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలపై అంతర్గత సర్వే నిర్వహించారు. 35 నియోజకవర్గాల్లో గెలుపు నల్లేరుమీద నడకే అని సర్వేలో తేలినట్లు సమాచారం. ఈ స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా గెలుస్తారని సర్వేలో వెల్లడైనట్లు సమాచారం. 35 నియోజకవర్గాల్లో ఎక్కువగా టీడీపీ బలంగా ఉందని సర్వేలో తేలినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

rahul 01112018

గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వారు పార్టీ మారినప్పటికీ.. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉనట్లు సమాచారం. అదేవిధంగా పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందని నివేదికలో వెల్లడైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల జాబితాను పార్టీ నాయకులు ప్రత్యేకంగా రాహుల్ గాంధీకి అందజేశారు. సర్వే నివేదిక, మహాకూటమి పొత్తులు, తాజా పరిస్థితిపై చర్చించేందుకు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ను ఢిల్లీకి రావాల్సిందిగా పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లారు. సర్వేలో తేలిన 35 సీట్లలో గెలుపు ఖాయం కాబట్టి.. మరో 25 స్థానాలపై దృష్టి సారిస్తే అధికారం ఖాయం అని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

rahul 01112018

కాంగ్రెస్ సర్వేలో టీడీపీ బలంగా ఉందని తేలిన నియోజకవర్గాలు ఇవే... దేవరకద్ర, మక్తల్, వనపర్తి, జడ్చర్ల, షాద్‌నగర్, పటాన్‌చెరు, జహీరాబాద్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, సిర్పూర్, ఖానాపూర్, జగిత్యాల, పెద్దపల్లి, నర్సంపేట్, ములుగు, వరంగల్ తూర్పు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, తుంగతుర్తి, ఆలేరు, ఉప్పల్, ఎల్‌బీ నగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ముషీరాబాద్, సనత్‌నగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉన్నట్లు సర్వేలో తేలింది.

 

Advertisements