ఒక పక్క బాధ్యతల నుంచి పారిపోయి, మోడీ, అమిత్ షా లకు భయపడి, రాజీనామా చేసి, ఇంట్లో కూర్చున్న ఎంపీలు, మరో పక్క సిబిఐ, ఈడీ, ఐటి దాడులతో బెదిరిస్తున్నా, చివరకు ఆరోగ్యం బాగోకపోయినా, రాష్ట్రం కోసం మోడీ, అమిత్ షా లకు ఢిల్లీలోనే ఎదురు తిరుగుతున్న ఎంపీలు.. ఇది మన రాష్ట్రంలో వివిధ ప్రజా ప్రతినిధులు ఎలా ఉన్నారనేది తెలియటానికి ఒక ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తున్న పోరాటంలో ఆ పార్టీ లోక్‌సభాపక్షనేత తోటనరసింహం, ఆరోగ్యం సహకరించక పోయినా, నిరసనలో పాల్గుంది నిబద్ధత చాటుకున్నారు. అనారోగ్యం కారణంగా నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ ఆయన పార్లమెంటు సిబ్బంది సాయంతో స్పీకర్‌ పోడియం వరకూ వెళ్లి నిరసన కొనసాగించారు.

thota 19122018 2

మధుమేహం, నరాల సమస్య కారణంగా ఆయన మనిషి సాయం లేనిదే అడుగువేయలేని స్థితికి చేరుకున్నారు. కొంతకాలంగా ఇంటికే పరిమితమైన ఆయన కొద్దీగా కోలుకున్నప్పటికీ నడవలేని పరిస్థితుల్లోనే ఉన్నారు. మంగళవారం అదే పరిస్థితుల్లో పార్లమెంటు సహాయ సిబ్బంది ఊతంతో సభలోకి మెల్లగా నడుచుకుంటూ వచ్చారు. ఇన్నాళ్లు ఆరోగ్యంతో కనిపించిన సహచర సభ్యుడు ఇలా నడవలేని స్థితిలో రావడం చూసి రోజూ ఆయన పక్కన కూర్చొనే సభ్యులు ఆశ్చర్యపోయారు. శివసేన నాయకుడు చంద్రకాంత్‌ఖైరే, ఐఎన్‌ఎల్‌డీ సభ్యుడు దుశ్యంత్‌చౌతాలా, బీజేడీ, బీజేపీ సభ్యులు ఆయన వద్దకు వచ్చి విషయం అడిగి తెలుసుకున్నారు. ఆయన వారికి తన పరిస్థితిని చెప్పడంతో అందరూ సానుభూతితో కూర్చోమని సూచించారు. అయితే తాను నిరసనలో పాల్గొనాలంటూ, సిబ్బంది ఊతంతో పోడియం వరకు మెల్లగా అడుగులోఅడుగేసుకుంటూ వచ్చారు.

thota 19122018 3

హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా తోటనరసింహం స్థితిని చూసి ఏమైందని అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఇక్కడ ఎందుకు నిల్చుంటారంటూ వెళ్లికూర్చోమని సూచించారు. కానీ తోటనరసింహం మాత్రం అలాగే ముందుకొచ్చి స్పీకర్‌ టేబుల్‌ను ఊతగా పట్టుకొని నిల్చొని ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ సహచర సభ్యుడు జయదేవ్‌గల్లాతో కలిసి నిరసన కొనసాగించారు. సభ వాయిదాపడేంతవరకూ అలాగే నిల్చొని ఆందోళన చేశారు. నిన్న తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తిగా ధర్మపోరాట దీక్ష నిర్వహించారు. ఏప్రిల్‌ 20న తన పుట్టినరోజును పురస్కరించుకొని చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేసిన విషయం విదితమే. దానిని స్ఫూర్తిగా మంగళవారం తన పుట్టినరోజు పురస్కరించుకొని రామ్మోహన్‌నాయుడు గాంధీ విగ్రహం వద్ద ఉభయ సభలు ప్రారంభం నుంచి ముగిసే వరకూ దీక్ష నిర్వహించారు. పలు పార్టీల నేతలు దీక్ష స్థలికి వచ్చి రామ్మోహన్‌నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి దీక్షకు సంఘీభావం తెలిపారు.

Advertisements