తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులుఎగబడ్డారు, దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గత 20 సంవత్సరాలలో టిటిడి  ఇంత  పాలనా పరమైన వైఫల్యం ఎప్పుడూ చెందలేదని భక్తులు మండిపడుతున్నారు.  భక్తులందరూ నిరసన తెలుపుతూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది పిల్లలకు పరీక్షలు ముగియటంతో  , శ్రీనివాసుని దర్సనం కోసం వేలాది మంది భక్తులు తిరుపతికి రావడంతో భక్తుల రద్దీ  విపరీతంగాపెరిగిపోయింది. అయితే తిరుమలలో  శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు ఇచ్చేచోట ఒకేసారి భక్తులు  ఎగబడటంతో  వారి మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో  కొంతమంది  భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. అందులో ఎక్కువమంది మహిళలు పిల్లలే ఉన్నారు. తోపులాటలో ముగ్గురికి గాయాలు కాగా ,గాయపడిన వారిని  రుయా ఆస్పత్రికి తరలించారు. అసలే ఎండలు మండి పోతుంటే,  ముసలి వారు,చంటి బిడ్డలతో వచ్చిన భక్తులు  విలవిలలాడిపోతున్నారు. టీటీడీ అధికారులు భక్తుల రద్దీని అంచనా వేయడంలో   తీవ్ర వైఫల్యం చెందారని భక్తులు తీవ్ర ఆవేదన చెందారు. వచ్చి మూడు, నాలుగు రోజులవుతున్నా కనీసం టోకెన్లు ఇవ్వట్లేదని, భోజనం, మంచినీళ్లు వంటి  కనీస సదుపాయాలు లేక కల్పించట్లేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు.

Advertisements