తెలంగాణ ఎన్నికల పోలింగ్‌ వేళ.. తాండూరు కాంగ్రెస్‌ అభ్యర్ధి పైలెట్‌ రోహిత్‌ రెడ్డి పై హత్యాయత్నం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఆయనపై తల్వార్లతో దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. అయితే చుట్టు కాంపౌండ్‌ వాల్‌ ఉండటంతో తృటిలో తప్పించుకున్నట్లు సమాచారాం. దాదాపు వంద మంది ఆయనపైదాడికి రాగా.. అందులో పది మంది తల్వార్లతో చంపేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న నిమిషాల్లోనే పోలీసులు, కాంగ్రెస్‌ నేతలు అక్కడికి చేరుకోవడంతో దుండగులు పరారయ్యారు. అయితే తనపై దాడి చేసింది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలేనంటున్న పైలెట్‌ రోహిత్‌రెడ్డి. ఈ మేరకు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసుల్ని కోరారు.

trs 07122018 2

కాంగ్రెస్- బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సమాచారం తెలిసి అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడడంతో ఆయనకు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అమనగల్ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ వద్ద శుక్రవారం ఉదయం కాంగ్రెస్-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు తోపులాటకు దిగాయి. కాగా... ఈ సమాచారం తెలిసి కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి అక్కడకు చేరుకోగా ఆయనపై కూడా బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడడంతో గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారిని అక్కడనుంచి పంపించివేశారు.

trs 07122018 3

టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు ఓటమి భయంతోనే ప్రజాకూటమి నేతలపై దాడులకు పాల్పడుతున్నారని టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి విమర్శించారు. కూటమి నేతలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు ఈసీ చర్యలు తీసుకోవాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండగా.. 1821 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మొత్తం 2.81 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1.90 లక్షల మంది భద్రతా బలగాలు పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొంటున్నాయి. అధికార తెరాస, మహాకూటమి అధికారం కోసం తలపడుతున్నాయి. మరోవైపు భాజపా, బీఎల్‌ఎఫ్‌, ఎంఐఎం సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి.

Advertisements