ఏపీ పోలీసులపై కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐటీ నిపుణుడు, ఐటీ గ్రిడ్‌పై ఫిర్యాదు చేసిన వైసీపీ నేత లోకేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. ఐటీ గ్రిడ్‌పై సైబరాబాద్‌లో లోకేశ్వర్ రెడ్డి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఒకపక్కన ఆ కేసుపై విచారణ జరుగుతుండగానే ఏపీ పోలీసులు తమ ఇంటికి వచ్చారని.. తనను బలవంతంగా తీసుకెళ్లేందుకు యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐటీ గ్రిడ్‌పై విచారణ జరగుతుండగా కేసు ఎలా నమోదు చేస్తారని లోకేశ్వర్ రెడ్డి ప్రశ్నించానని... అయినా బలవంతంగా ఎత్తుకెళ్లడానికి ఏపీ పోలీసులు యత్నించారని ఆయన తెలిపారు. తనను బెదిరించింది ఏపీ పోలీసులని ఆరోపించారు. లోకేశ్వర్ రెడ్డి ఇంటికెళ్లిన ఏపీ పోలీసులపై చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.

tpolice 04032019

మరో పక్క, ఈ దాడులని ఏపి ప్రభుత్వం ఖండించింది. సీఎం కేసీఆర్‌, వైసీపీ అధినేత జగన్‌ జోడి.. టీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌ మాటల్లో మరోసారి బయటపడిందని మంత్రి లోకేష్‌ చెప్పారు. కేటీఆర్‌ ఇచ్చిన స్క్రిప్ట్‌నే వైసీపీ నేతలు చదువుతున్నారని, వైసీపీ ప్రొడక్షన్‌..టీఆర్‌ఎస్‌ డైరెక్షన్‌లో టీడీపీ సభ్యత్వ, సర్వే డేటా దొంగిలించారని ట్విట్టర్‌లో లోకేష్‌ ఆరోపించారు. డేటా చోరీ చరిత్ర మీదని, బలమైన పార్టీ తమదని ఆయన స్పష్టం చేశారు. జగన్‌ మోదీ రెడ్డికి ఏపీ ప్రతిపక్ష నేతగా జీతం కావాలని, ఏపీ పోలీసుల రక్షణ కావాలని, ఏపీ ప్రజల ఓట్లు కావాలన్నారు. టీఎస్‌లో ఉంటూ టీఆర్‌ఎస్‌ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ట్విట్టర్‌లో నారా లోకేష్‌ ధ్వజమెత్తారు.

tpolice 04032019

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, పోలీసు వ్యవస్థకు సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ పోలీసుల జోక్యం తమ హక్కులను కాలరాయడమేనని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన ఆరోపించారు. డేటా పేరుతో తెదేపాకు సేలందిస్తున్న ఐటీ గ్రిడ్‌ సంస్థపై తెలంగాణ పోలీసుల కేసు నమోదు, విచారణ నేపథ్యంలో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైకాపా, తెరాస, భాజపా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. వైకాపా నాయకులకు తెలంగాణ పోలీసులపైనే ఎందుకు నమ్మకముందని ప్రశ్నించారు. ఏపీ ప్రజలు ఓటేస్తే హైదరాబాద్‌లో ఉండి కేటీఆర్‌తో కలిసి పాలిస్తారా అంటూ పరోక్షంగా వైకాపా నేతలను ఉద్దేశించి సోమిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంతో వైకాపా క్రిమినల్‌ మైండ్‌ బయటపడిందన్నారు. ఆ పార్టీ చరిత్రంతా నేరపూరితమైనదేనన్నారు.

Advertisements