దివంగ‌త ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిపై, సీనియ‌ర్ నేత‌,రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవినీతికి పాల్పడలేదని, తాను ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. వైఎస్‌ మనీ టేకింగ్ చేశారన్నారు. కానీ మనీ మేకింగ్ చేయలేదని చెప్పారు. రెండు రోజుల కిందట.. ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్‌మీట్ పెట్టి.. అమరావతి బాండ్ల పై విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు పై మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు.

cbn 07092018 2

రాజా ఆఫ్ కరెప్షన్ బుక్ పై కుటుంబరావు చేసిన బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు.. ప్రభుత్వ జీతం తీసుకుంటూ టీడీపీ ప్రతినిధిగా మారారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పై ఈర్ష్య ఉంటే తాను ముఖ్యమంత్రిని ఎందుకు కలుస్తానని వెల్లడించారు. మరిన్ని వాస్తవాలు బయటపెడతానని ఉండవల్లి స్పష్టం చేశారు. కాని ఉండవల్లి అరుణ్ కుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్.. టీడీపీ కన్నా… వైసీపీనే ఎక్కువ కలవర పెడుతోంది. వైఎస్ అవినీతి చేశాడని ఆయన చెప్పడం వైసీపీ నేతలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

cbn 07092018 3

వైఎస్ అవినీతి చేశాడని ముందు స్టేట్‌మెంట్ ఇచ్చేసి తర్వాత ఎంత సమర్థించుకున్నా అది ప్రజల్లోకి వెళ్లదు. ఆయన అవినీతి ఆరోపణే ప్రజల్లోకి బాగా వెళుతుందని వైసీపీ వర్గాలలో చర్చనీయంసం అయ్యింది. అదే సమయంలో రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకాన్ని అందులో ఉన్న అంశాల్ని మరోసారి హాట్ టాపిక్ చేసేలా.. బహిరంగచర్చకు సిద్ధమని, ఉండవల్లి అనడం వైసీపీ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. జరిగిపోయిన అవినీతి వ్యవహారాల అంశాలను మళ్లీ తెరపైకి తెచ్చే ప్రకటనలు ఉండవల్లి ఎందుకు చేస్తున్నారో వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు.ఆఖరిలో మరిన్ని వాస్తవాలతో ముందుకు వస్తాననని ఉండవల్లి అరుణ్ కుమార్ అనటం వైసీపీ వర్గాలను మరింత కంగారు పెడుతోంది.

Advertisements