భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) ఆరోగ్యం విషమించింది. కిడ్నీ సమస్య, వృద్ధాప్య సమస్యలతో కొద్దికాలంగా బాధపడుతున్న వాజ్‌పేయి ఇటీవల ఎయిమ్స్‌లో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బుధవారంనాడు క్షీణించడంతో పార్టీ అగ్రనేతలు అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకుని ఎయిమ్స్ చేరుకుంటున్నట్టు పార్టీ వర్గాలు సమాచారం. విషయం తెలిసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎయిమ్స్ కు వెళ్లి వాజ్‌పేయిని పరామర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ హుటాహుటిన ఎయిమ్స్‌కు చేరుకున్నారు.

atal 15082018 2

వాజపేయి ఆరోగ్య పరిస్థితిని, ఆయనకు అందిస్తున్న వైద్యం గురించి ప్రధాని మోదీ వైద్యులను వాకబు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరో గంటలో వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్‌ బులెటిన్‌ను ఎయిమ్స్‌ వైద్యులు విడుదల చేయనున్నారు. వాజ్‌పేయి ఆరోగ్యం విషమించిందని తెలియడంతో బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ గురువారం చేపట్టబోయే తన అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకుంది. రేపు విజయవాడలో జరగాల్సిన బీజేపీ కార్యాలయ శంకుస్థాపన కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది

atal 15082018 3

మూత్ర సంబంధ సమస్యలతో బాధపడుతున్న వాజ్‌పేయి జూన్‌ 12న ఎయిమ్స్‌లో చేరారు. ప్రస్తుతం వాజ్‌పేయి కిడ్నీ ఒక్కటే పనిచేస్తోంది. ఆయనకు డయాబెటిస్‌తోపాటు డిమెన్షియా ఉంది. వాజ్‌పేయి ఆరోగ్య పరస్థితి దృష్ట్యా గురువారంనాడు పార్టీ అధికారిక కార్యక్రమాలు వాయిదా పడినట్టు తెలుస్తోంది. నేతలంతా ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. గత వారం హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం ఎయిమ్స్‌కు వెళ్లి వాజ్‌పేయిని పరామర్శించారు. గత నెలలో నీతీ అయోగ్ సమవేశానికి వెళ్ళినప్పుడు, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వెళ్లి పరామర్శించారు.

Advertisements