కృష్ణాజిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరో సారి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం వంశీ, తన గన్‌మెన్‌ను ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు.

టు ప్లస్‌ టు గన్‌మెన్‌లు ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని, అందుకే ఇలా నిరసన తెలియచేసానని అంటున్నారు. అదనంగా సెక్యూరిటీ ఇవ్వనందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే వంశీ తీరు, తెలుగుదేశం పార్టీలో చర్చనీయంసం అయ్యింది... ప్రతి దానికి వంశీ పెద్ద విషయం చేస్తారని, ప్రభుత్వం వచ్చినాక వంశీ ఇలా చెయ్యటం మూడో సారి అంటున్నారు... ఏదైనా ఉంటే, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుకోవాలి కాని, ఇలా మీడియాకి ఎక్కి సెన్సేషన్ అవ్వటం కోసం, ప్రయత్నం ఎందుకు అని అంటున్నారు.

అందరి ఎమ్మెల్యేలు లాగే వంశీకి సెక్యూరిటీ ఇచ్చాం అని, చెప్తున్నారు.. వంశీ నిరసనను ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో చూడాలి...

Advertisements